ఐపీఎల్‌ 2020 పాయింట్ల పట్టికలో టాప్ లో ఢిల్లీ

     Written by : smtv Desk | Sat, Sep 26, 2020, 11:42 AM

ఐపీఎల్‌ 2020 పాయింట్ల పట్టికలో టాప్ లో ఢిల్లీ

ఐపీఎల్ 2020 సీజన్‌లో టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ అంచనాల్ని అందుకుంటూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో గెలుపొందిన ఢిల్లీ క్యాపిటల్స్.. 4 పాయింట్లతో నెం.1 స్థానంలో నిలవగా.. ఆ తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ టాప్-4లో చోటు దక్కించుకున్నాయి. టోర్నీ లీగ్ దశ ముగిసే సమయానికి టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌కి అర్హత సాధించనున్న విషయం తెలిసిందే.

ఐపీఎల్ 2020 సీజన్‌‌లో మూడు మ్యాచ్‌లాడిన చెన్నై టీమ్ రెండింటిలో ఓడినప్పటికీ ఐదో స్థానాన్ని దక్కించుకోగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన రెండింటిలో ఒకదాంట్లో ఓడి ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక ఒక మ్యాచ్ మాత్రమే ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆ మ్యాచ్‌లో ఓడి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానాల్లో నిలిచాయి. అబుదాబి వేదికగా శనివారం రాత్రి 7.30 గంటలకి కోల్‌కతా, హైదరాబాద్ జట్లు తలపడబోతున్నాయి.

ఐపీఎల్‌ 2020 సీజన్‌లో మొత్తం 56 లీగ్ దశ మ్యాచ్‌లు జరగనుండగా.. టోర్నీలోని ప్రతి జట్టూ మిగిలిన ఏడు జట్లతో రెండేసి మ్యాచ్‌ల్లో తలపడనుంది. దాంతో.. టీమ్స్ ఆడే 14 మ్యాచ్‌ల్లో కనీసం 8 మ్యాచ్‌ల్లో గెలిస్తే అలవోకగా ప్లేఆఫ్‌కి వెళ్లే అవకాశాలు ఉంటాయి. మ్యాచ్‌లను గెలవడమే కాకుండా రన్‌రేట్‌ని కాపాడుకోవడం కూడా టీమ్స్‌కి ముఖ్యమే. ఒకవేళ లీగ్ దశ ఆఖర్లో పాయింట్లు సమమైనా మెరుగైన రన్‌రేట్‌ ఉన్న టీమ్ ముందుకు వెళ్లనుంది.





Untitled Document
Advertisements