ఐపీఎల్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం!?

     Written by : smtv Desk | Sat, Sep 26, 2020, 01:39 PM

ఐపీఎల్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం!?

రాజస్థాన్ రాయల్స్ కీలక ఆటగాళ్లలో ఒకడైన బెన్ స్టోక్స్.. తొలి మ్యాచ్‌లో ఆడని సంగతి తెలిసిందే. 2018 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ అతణ్ని రూ.12.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్‌పై రాజస్థాన్ జట్టు అతిగా ఆధారపడుతోంది. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌కు దూరమైన అతడు అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో రాజస్థాన్ రాయల్స్ టీంలో చేరతాడని వార్తలొచ్చాయి.

కానీ ఐపీఎల్ 13వ సీజన్‌కు బెన్‌స్టోక్స్ దూరమయ్యే అవకాశ ఉందని ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ తెలిపాడు. స్టోక్స్ తండ్రికి బ్రెయిన్‌ క్యాన్సర్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో న్యూజిలాండ్‌లో ఉన్న తన కుటుంబానికి సపోర్ట్‌గా ఉండటం కోసం స్టోక్స్ ఇంగ్లాండ్ నుంచి న్యూజిలాండ్ వెళ్లాడు.

‘‘బెన్ స్టోక్స్ తండ్రి ఆరోగ్యం బాగోలేదు. ఈ కారణంతో అతడు న్యూజిలాండ్‌లోనే ఉండాల్సి రావొచ్చు. అతడు ఐపీఎల్ కోసం యూఏఈ వెళ్లేది అనుమానమే’’ అని పనేసర్ తెలిపాడు. స్టోక్స్‌ను సూపర్ మ్యాన్ ఆఫ్ క్రికెట్‌తో పోల్చిన పనేసర్.. ఐపీఎల్‌లో అతడు ఆడితే దాని ప్రభావం కచ్చితంగా ఉంటుందన్నాడు.

చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ 216 రన్స్ చేయగా.. బదులుగా చెన్నై 200 పరుగులకు పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో స్మిత్, శాంసన్ హాఫ్ సెంచరీలు బాదగా.. ఆఖర్లో ఆర్చర్ వరుసగా నాలుగు సిక్స్‌లు బాదాడు.

Untitled Document
Advertisements