కరోనా మృతదేహం తారుమారు...ఆగిపోయిన అంతక్రియలు

     Written by : smtv Desk | Sat, Sep 26, 2020, 01:49 PM

కరోనా మృతదేహం తారుమారు...ఆగిపోయిన అంతక్రియలు

కరోనా మృతదేహం తారుమారు అయిన ఘటన నిజామాబాద్‌లో చోటు చేసుకుంది. దీంతో అంత్యక్రియలు నిలిచిపోయాయి. తాజాగా హైదరాబాద్ ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం బయటపడింది. కరోనాతో చనిపోయిన వ్యక్తికి బదులు మరో మృతదేహం రావడంతో నిజామాబాద్ జిల్లాలో అంత్యక్రియలు నిలిచిపోయాయి. దీంతో బంధువులు అయోమయోంలో పడిపోయారు.

ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన అంకం హనుమంతుకు కరోనా సోకింది. దీంతో అతడ్ని మెరుగైన వైద్యం కోసంహైదరాబాదులో ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హనుమంతు మరణించారు. అయితే అంత్యక్రియల కోసం మృతదేహాన్ని స్వగ్రామానికి ఆస్పత్రి సిబ్బంది తీసుకొచ్చారు. అయితే ఆస్పత్రి సిబ్బంది తీసుకొచ్చిన మృతదేహం హనుమంతుది కాదని తేలింది. దీంతో బంధువులంతా షాక్ అయ్యారు.

అంత్యక్రియలకు కొన్ని క్షణాల ముందు మృతదేహాలు తారుమారు అయినట్లు ఆసుపత్రి వర్గాలు గుర్తించాయి. వెంటనే అంత్యక్రియలు నిలిపివేయాలని అంబులెన్స్ డ్రైవర్ కు సమాచారం అందింది. దీంతో మృతదేహాల్ని మార్చడం ఏంటని గ్రామస్థులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హనుమంతు మృతదేహాన్ని తీసుకొచ్చి ఈ మృతదేహాన్ని తీసుకెళ్లాలని బంధువుల పట్టుపడుతున్నారు. దీంతో అక్కడ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది.





Untitled Document
Advertisements