పోస్టాఫీస్‌ స్కీమ్స్...ఇలా చేస్తే చేతికి రూ.7 లక్షలు!

     Written by : smtv Desk | Sat, Sep 26, 2020, 08:30 PM

పోస్టాఫీస్‌ స్కీమ్స్...ఇలా చేస్తే చేతికి రూ.7 లక్షలు!

పోస్టాఫీస్ గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన అవసరం లేదు. ఇన్వెస్ట్‌మెంట్ల పరంగా చూస్తే పోస్టాఫీస్ ఇన్వెస్ట్‌మెంట్స్ రిస్క్ లేనివని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది. అందువల్ల చాలా మంది పోస్టాఫీసుల్లో డబ్బులు దాచుకుంటూ ఉంటారు. పోస్టాఫీస్‌లో చాలా స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి.

పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్ కూడా ఈ స్కీమ్‌లో ఒకటి. ఇందులో డబ్బులు దాచుకోవడం ద్వారా బ్యాంకుల్లో కన్నా ఎక్కువ వడ్డీ పొందొచ్చు. ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్లు చొప్పున ఈ స్కీమ్‌లో డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఐదేళ్ల కాల పరిమితిలో డబ్బులు దాచుకుంటే ఎక్కువ వడ్డీ వస్తుంది.

ఉదాహరణకు మీరు ఐదేళ్ల కాల పరిమితితో రూ.5 లక్షలను పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేశారని అనుకుంటే.. మీకు మెచ్యూరిటీ సమయంలో చేతికి రూ.7.25 లక్షలు వస్తాయి. అంటే మీకు వడ్డీ రూపంలో రూ.2.25 లక్షలు వస్తాయి. మీ డబ్బుకు 7.7 శాతం వడ్డీ లభిస్తుంది. ఐదేళ్లు కాకుండా మూడేళ్ల కాల పరిమితితో డబ్బులు డిపాజిట్ చేస్తే మీకు చేతికి రూ.6.1 లక్షలు వస్తాయి.

అదే మీరు రెండేళ్ల కాల పరిమితితో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే అప్పుడు మీ చేతికి రూ.5.7 లక్షలు లభిస్తాయి. మీరు ఏడాది కాలం పాటు డబ్బులు దాచుకుంటే అప్పుడు మీకు చేతికి రూ.5.34 లక్షలు వస్తాయి. వడ్డీ రూపంలో రూ.34 వేలు లభిస్తాయి. కనీసం రూ.1000 నుంచి మీరు ఈ స్కీమ్‌లో డిపాజిట్ చేసుకోవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఐదేళ్ల కాల పరిమితితో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే పన్ను ప్రయోజనాలు పొందొచ్చు.





Untitled Document
Advertisements