డీకే అరుణ, పురందేశ్వరికి బీజేపీలో అగ్ర పీఠం?!

     Written by : smtv Desk | Sat, Sep 26, 2020, 08:56 PM

డీకే అరుణ, పురందేశ్వరికి బీజేపీలో అగ్ర పీఠం?!

బీజేపీ తన జాతీయ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. ఈ కార్యవర్గంలో తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు మహిళలకు చోటు దక్కింది. వారే డీకే అరుణ, పురందేశ్వరి. తెలంగాణకు చెందిన డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరిని నియమించారు. ఈ కార్యవర్గానికి సంబంధించి శనివారం ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమించారు.

ఈ కార్యవర్గంలో మొత్తం 12 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా, 8 మందిని జాతీయ ప్రధాన కార్యదర్శులగా, ముగ్గురు జాయింట్‌ జనరల్‌ సెక్రటరీలుగా ఉన్నారు. జాతీయ కార్యదర్శులుగా 13 మందికి అవకాశం ఇచ్చారు. జాతీయ అధికార ప్రతినిధులుగా 23 మందికి స్థానం ఇచ్చారు. వీటితో పాటు బీజేపీకి చెందిన ఇతర విభాగాలకు కూడా అధ్యక్షులను, ఇన్‌ఛార్జులను కూడా నియమించారు.

తాజాగా జాతీయ కార్యవర్గంలో నలుగురు తెలుగువాళ్లకు స్థానం దక్కగా.. పలువురు సీనియర్లు మాత్రం దీనిపై అసహనంతో ఉన్నారు. వీరు గతంలో ప్రధాన కార్యదర్శులుగా ఉన్నారు. వారిలో మురళీధర్‌ రావు, రాంమాధవ్‌ను పేర్లను ప్రస్తుత లిస్టు నుంచి తప్పించారు. పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న జీవీఎల్‌ నర్సింహారావును కూడా ఆ పదవి నుంచి తప్పించారు.

Untitled Document
Advertisements