మీ పాప పేరుపై ఈ ఖాతా తెరవండి....పెళ్లి టైమ్ కల్లా చేతికి రూ.64 లక్షలు!

     Written by : smtv Desk | Sun, Sep 27, 2020, 12:14 PM

మీ పాప పేరుపై ఈ ఖాతా తెరవండి....పెళ్లి టైమ్ కల్లా చేతికి రూ.64 లక్షలు!

ఈరోజు డాటర్స్ డే. ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలోని నాలుగో ఆదివారం రోజు డాటర్స్ డే జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఈరోజు ఆడ పిల్లల పేరుపై కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అదిరిపోయే స్కీమ్ గురించి తెలుసుకుందాం. మీ అమ్మాయికి బంగారు భవిష్యత్ కానుకగా ఇవ్వాలని భావిస్తే.. అలాగే వారికి ఆర్థిక భద్రత కల్పించాలని అనుకుంటే ఈ స్కీమ్ కరెక్ట్‌గా ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం ఆడ పిల్లల పేరుపై సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని అందిస్తోంది. ఈ పథకంలో అందరూ చేరడానికి వీలు లేదు. కేవలం ఆడ పిల్ల పేరుపై మాత్రమే ఈ పథకంలో చేరొచ్చు. ఒక ఇంట్లో గరిష్టంగా 2 అమ్మాయిల పేరుపై సుకన్య సమృద్ధి అకౌంట్ తెరవొచ్చు. కవలలు పుడితే అప్పుడు ముగ్గురి పేరుపై కూడా ఈ ఖాతా ఓపెన్ చేయొచ్చు.

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సహా ఇతర బ్యాంకులు, పోస్టాఫీసులకు వెళ్లి సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేరొచ్చు. పదేళ్లలోపు వయసు ఉన్న ఆడ పిల్లల పేరుపైనే ఈ అకౌంట్ తెరవడం వీలవుతుంది. అందుకే మీ పాపకు పదేళ్లు వచ్చే లోపు ఈ పథకంలో చేరండి. ఈ స్కీమ్‌లో చేరిన వారు ప్రతి నెలా కొంత మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి.

ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 ఇన్వెస్ట్ చేసినా సరిపోతుంది. మీ అకౌంట్ కొనసాగుతుంది. గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఈ స్కీమ్‌లో డిపాజిట్ చేయొచ్చు. ప్రతి నెలా మీకు నచ్చిన మొత్తాన్ని స్కీమ్‌లో డిపాజిట్ చేసుకుంటే వెలితే సరిపోతుంది. ఈ పథకంలో చేరిన వారు అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గరి నుంచి 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి.

సుకన్య సమృద్ధి యోజన మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. ఈ తర్వాతనే అకౌంట్‌లోని డబ్బులు తీసుకోవడం వీలవుతుంది. అమ్మాయికి 18 ఏళ్లు దాటిన తర్వాత అకౌంట్ నుంచి కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. అమ్మాయి పెళ్లి లేదంటే ఉన్నత చదువలు కోసం అకౌంట్‌లోని డబ్బులు తీసుకొని ఉపయోగించుకోవచ్చు.
అంతేకాకుండా సుకన్య సమృద్ధి అకౌంట్లో డబ్బులు పెట్టడం వల్ల పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందొచ్చు. అలాగే వడ్డీ కూడా వస్తుంది. సుకన్య సమృద్ధి అకౌంట్‌పై ప్రస్తుతం 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ ప్రకారం నెలకు రూ.12,500 ఇన్వెస్ట్ చేస్తే వెలితే.. మెచ్యూరిటీ తర్వాత చేతికి ఏకంగా రూ.63.9 లక్షలు పొందొచ్చు.

Untitled Document
Advertisements