బ్యాంక్ వినూత్న సేవలు..ఒకే అకౌంట్‌పై 3 ఏటీఎం కార్డులు!

     Written by : smtv Desk | Sun, Sep 27, 2020, 12:38 PM

బ్యాంక్ వినూత్న సేవలు..ఒకే అకౌంట్‌పై 3 ఏటీఎం కార్డులు!

మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే మీ అకౌంట్‌కు కచ్చితంగా ఒక డెబిట్ కార్డు లభిస్తుంది. అంటే ఒక డెబిట్ కార్డుకు ఒక అకౌంట్ మాత్రమే లింక్ అయ్యి ఉంటుంది. అయితే ఇప్పుడు కొత్త సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఒక బ్యాంక్ మాత్రం ఒకే అకౌంట్‌పై ఒకటి కన్నా ఎక్కువ డెబిట్ కార్డు సదుపాయం అందిస్తోంది. అంతేకాకుండా ఒకే డెబిట్ కార్డును ఒకటి కన్నా ఎక్కువ ఖాతాలకు లింక్ చేసుకోవచ్చు.
చదవడానికి విచిత్రంగా ఉంది కదూ.. కానీ ఇది నిజం. దేశీ రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తాజాగా కస్టమర్లకు వినూత్నమైన సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. యాడ్ ఆన్ కార్డ్, యాడ్ ఆన్ అకౌంట్ పేరుతో కొత్త సేవలు ఆవిష్కరించింది.

పీఎన్‌బీ ప్రకారం.. యాడ్ ఆన్ కార్డు ఫెసిలిటీలో భాగంగా ఒక బ్యాంక్ అకౌంట్‌పై మూడు డెబిట్ కార్డులు పొందొచ్చు. కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించాలనే లక్ష్యంతో బ్యాంక్ ఈ సర్వీసులు తీసుకువచ్చింది. అంతేకాకుండా యాడ్ ఆన్ అకౌంట్‌ సర్వీసుల్లో భాగంగా మూడు రకాల అకౌంట్లను ఒకే డెబిట్ కార్డుతో అనుసంధానం చేసుకోవచ్చు.

యాడ్ ఆన్ కార్డ్ ఫెసిలిటీ కేవలం అకౌంట్ దారుడి తల్లిదండ్రులు, భాగస్వామి, పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన వారి పిల్లలు లేదా భార్య/భర్త, అమ్మ, నాన్నలకు మాత్రమే అదనంగా రెండు కార్డులు అందిస్తారు.
ఇకపోతే మూడు అకౌంట్లను ఒకే డెబిట్ కార్డుతో లింక్ చేసుకోవడం అనేది కేవలం కొందరికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇలా లింక్ చేసుకున్న వారు డెబిట్ కార్డుతో మూడు అకౌంట్లలో నచ్చిన అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ సేవలు కేవలం పీఎన్‌బీ ఏటీఎంలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఇతర ఏటీఎంలలో డబ్బులు తీసుకుంటే మెయిన్ అకౌంట్‌ నుంచి డబ్బులు కట్ అవుతాయి. మూడు అకౌంట్లు ఒకే వ్యక్తి పేరుపై ఉంటేనే లింక్ చేసుకోవడం వీలవుతుంది.

Untitled Document
Advertisements