గూగుల్ పిక్సెల్ 4ఏ స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభం

     Written by : smtv Desk | Fri, Oct 16, 2020, 04:51 PM

గూగుల్  పిక్సెల్ 4ఏ స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభం

గూగుల్ ఇండియాలో తాజాగా లాంచ్ చేసిన పిక్సెల్ 4ఏ స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభం అయింది. బిగ్ బిలియన్ డేస్‌లో భాగంగా దీన్ని ఫ్లిప్ కార్ట్‌లో అమ్మకానికి ఉంచారు. ప్రస్తుతానిక అక్కడ మాత్రమే ఈ ఫోన్ అందుబాటులో ఉంది. దీనిపై కార్డు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ ధరను మనదేశంలో రూ.31,999గా నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్ లాంచ్ అయింది, అయితే కొన్ని రోజుల పాటు కంపెనీ ఈ ఫోన్‌ను రూ.29,999కే అందించనుంది. దీంతో పాటు ఎస్‌బీఐ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. మొత్తంగా రూ.27 వేలలో ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 5.81 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఓఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. దీని డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 19.5:9గా ఉంది. హెచ్‌డీఆర్ సపోర్ట్‌ను కూడా కంపెనీ ఇందులో అందించింది. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 730జీ ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం లేదు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. దీన్ని ఆండ్రాయిడ్ 11కు అప్ గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ లో వెనకవైపు 12 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. ఇందులో హెచ్ డీఆర్+ డ్యూయల్ ఎక్స్ పోజర్ కంట్రోల్స్, పొర్ ట్రెయిట్ మోడ్, టాప్ షాట్, నైట్ సైట్, ఆస్ట్రో ఫొటోగ్రఫీ వంటి సూపర్ కెమెరా ఫీచర్లను గూగుల్ అందించింది. ఇక సెల్ఫీల కోసం ముందువైపు 8 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్ సీ, యూఎస్ బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కనెక్టివిటీ ఫీచర్లను ఇందులో అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ వెనకభాగంలో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 3140 ఎంఏహెచ్ గా ఉండగా, 18W ఫాస్ట్ చార్జింగ్ ను కూడా గూగుల్ పిక్సెల్ 4ఏ సపోర్ట్ చేయనుంది. ఇందులో యూఎస్ బీ టైప్-సీ పోర్టు ఉంది. ఈ ఫోన్ మందం 0.82 సెంటీమీటర్లుగా ఉండగా, బరువు కేవలం 143 గ్రాములు మాత్రమే.

Untitled Document
Advertisements