ఐసీఐసీఐ బ్యాంక్ శుభవార్త, అందుబాటులో మరిన్ని సేవలు

     Written by : smtv Desk | Sat, Oct 17, 2020, 11:57 AM

ఐసీఐసీఐ బ్యాంక్ శుభవార్త, అందుబాటులో మరిన్ని సేవలు

ప్రైవేట్ రంగ దిగ్గజం ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. కొత్త సర్వీసులను ఆవిష్కరించింది. వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలను అందుబాటులో ఉంచింది. దీంతో బ్యాంక్ ఖాతాదారులకు ప్రయోజనం కలుగనుంది.

ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు ఇకపై ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్లను FD వాట్సాప్ ద్వారానే ఓపెన్ చేయొచ్చు. అంతేకాకుండా యుటిలిటీ బిల్లులను కూడా వాట్సాప్ ద్వారానే చెల్లించొచ్చు. ట్రేడింగ్ లావాదేవీల వివరాలను కూడా తక్షణమే వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు.

బ్యాంక్ తాజాగా సర్వీసులతో కలుపుకుంటే.. బ్యాంక్ కస్టమర్లు వారి వాట్సాప్ ద్వారా బ్యాంక్ నుంచి 25 రకాల సేవలు పొందొచ్చు. సోషల్ మీడియాలో వినియోగం పెరుగుతోందని, వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సర్వీసుల కారణంగా కస్టమర్లకు ఊరట కలుగుతుందని ఐసీఐసీఐ బ్యాంక్ హెడ్ (డిజిటల్ ఛానెల్స్ అండ్ పార్ట్‌‌నర్‌షిప్) బిజిత్ భాస్కర్ తెలిపారు.

ఆరు నెలల కాలంలోనే 20 లక్షలకు పైగా బ్యాంక్ కస్టమర్లు వాట్సాప్ ద్వారా సేవలు పొందుతున్నారని ఆయన తెలిపారు. రిటైల్, ఎన్ఆర్‌ఐ, కార్పొరేట్, ఎంఎస్ఎంఈ కస్టమర్లు ఐసీఐసీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీసులు పొందొచ్చని పేర్కొన్నారు. ఇకపోతే బ్యాంక్ వాట్సాప్ సేవలు పొందాలని భావిస్తే 86400 86400 నెంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి.

నెంబర్ ఫోన్‌లో సేవ్ చేసుకున్న తర్వాత వాట్సాప్‌లోకి వెళ్లి హాయ్ అని మెసేజ్ పెట్టాలి. తర్వాత బ్యాంక్ నుంచి మీకు రిప్లే వస్తుంది. ఏ ఏ సర్వీసులు పొందవచ్చొ మీకు తెలియజేస్తుంది. తర్వాత మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయొచ్చు. గ్యాస్, కరెంటు బిల్లు కట్టొచ్చు. మొబైల్ రీచార్జ్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డు లిమిట్ ఎంత ఉంతో తెలుసుకోవచ్చు.





Untitled Document
Advertisements