'బీబీ3': బాలయ్యకు జోడీగా మలయాళ బ్యూటి?

     Written by : smtv Desk | Sat, Oct 17, 2020, 12:49 PM

'బీబీ3': బాలయ్యకు జోడీగా మలయాళ బ్యూటి?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ‘సింహా’, ‘లెజెండ్‌’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా మలయాళ భామ ప్రయాగ మార్టిన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. క్లాసికల్ డ్యాన్సర్, మోడల్‌ అయిన ప్రయాగ మార్టిన్ మలయాళంలో చైల్డ్ ఆర్టిస్టుగా తెరంగ్రేటం చేసి.. ఆ తర్వాత హీరోయిన్‌గానూ మెరిసింది. తమిళంలో ‘పిశాచి’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ నటించిన ఉస్తాద్ హోటల్ మూవీలోనూ కనిపించింది. త్వరలోనే మొదలు కానున్న షెడ్యూల్‌లో ప్రయాగ‌పై సన్నివేశాలు తెరకెక్కించేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోందట. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. బాలయ్య-బోయపాటి హ్యాట్రిక్ కాంబినేషన్లో వస్తున్న ‘బీబీ3’ వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి.

Untitled Document
Advertisements