‘సర్కారు వారి పాట’: కీర్తి సురేష్‌కు వెల్ కమ్ చెప్పిన మహేష్

     Written by : smtv Desk | Sat, Oct 17, 2020, 02:04 PM

‘సర్కారు వారి పాట’: కీర్తి సురేష్‌కు వెల్ కమ్ చెప్పిన మహేష్

మహానటి’ సినిమాతో శిఖరస్థాయి ఇమేజ్ సొంతం చేసుకుంది కీర్తి సురేష్. అలనాటి నటి సావిత్రిని మరిపిస్తూ ఆమె చూపించిన అభినయం ప్రేక్షకుల మనసులను దోచుకుని ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సైతం అందుకుంది. ఆ సినిమా తెచ్చిన క్రేజ్‌తో సినిమాలను ఆచితూచి ఎంచుకుంటున్న కీర్తి.. ప్రస్తుతం స్టార్ హీరోలకే ప్రాధాన్యం ఇస్తోంది. తాజాగా మహేష్‌బాబుతో ‘సర్కారు వారి పాట’లో ఛాన్స్ దక్కించుకున్న ఈ బ్యూటీ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా టాలీవుడ్‌ ప్రముఖులు ఆమెకు బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే తన కో స్టార్‌కు సూపర్‌‌స్టార్‌ మహేష్‌ బాబు ట్విట్టర్‌ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ‘టాలెంటెడ్‌ కీర్తి సురేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘సర్కార్‌ వారి పాట’ టీమ్ మీకు ఫారిన్‌ వెళ్లడానికి స్వాగతం పలుకుతోంది. కచ్ఛితంగా ఈ సినిమా మీ జీవితంలో ఒక మంచి గుర్తుగా మిగిలిపోతుంది’ అని మహేష్‌‌బాబు ట్వీట్‌ చేశారు.


Untitled Document
Advertisements