రెడ్‌మీ కే30ఎస్ స్పెసిఫికేషన్లు లీక్

     Written by : smtv Desk | Sat, Oct 17, 2020, 02:06 PM

రెడ్‌మీ కే30ఎస్ స్పెసిఫికేషన్లు లీక్

టెనా సర్టిఫికేషన్ వెబ్ సైట్లో కొత్త రెడ్ మీ స్మార్ట్ ఫోన్ కనిపించింది. దీని మోడల్ నంబర్ M2007J3SCగా ఉంది. ఈ ఫోన్ రెడ్ మీ కే30ఎస్ అని లీకుల ద్వారా తెలుస్తోంది. ఈ లిస్టింగ్‌లో దీని పూర్తి స్పెసిఫికేషన్లు, ఫొటోలు కూడా ఆన్ లైన్‌లో లీకయ్యాయి. ఈ లిస్టింగ్‌లో ఉన్న స్పెసిఫికేషన్లు ఈ మధ్యే లాంచ్ అయిన ఎంఐ 10టీకి దగ్గరగా ఉన్నాయి. కాబట్టి రెడ్ మీ కే30ఎస్.. ఎంఐ 10టీకి రీబ్రాండెడ్ వెర్షన్ అనుకోవచ్చు. ఈ ఎంఐ 10టీ మనదేశంలో కూడా ఇటీవలే లాంచ్ అయింది. టెనా లిస్టింగ్ ప్రకారం రెడ్ మీ ఫోన్ మోడల్ నంబర్ M2007J3SCలో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్టీపీఎస్ డిస్ ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1080x2400 పిక్సెల్స్‌గా ఉంది. డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ ప్రాసెసర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 కావచ్చు. 6 జీబీ, 8 జీబీ, 12 జీబీ ర్యామ్ ఆప్షన్లు, 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఇందులో ఉండనున్నాయి. ఇందులో మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ అందించలేదు. దీని బ్యాటరీ సామర్థ్యం 4900 ఎంఏహెచ్‌గా ఉండనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 13 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగా పిక్సెల్ మాక్రో షూటర్ ఉన్నాయి. ఎంఐ 10టీ కెమెరా స్పెసిఫికేషన్లు కూడా ఇవే. ఈ ఫోన్ 16.51 సెంటీమీటర్ల పొడవు, 7.64 సెంటీమీటర్ల వెడల్పు, 0.93 సెంటీమీటర్ల మందం ఉండనున్నాయి. దీని బరువు 216 గ్రాములుగా ఉండనుంది. బ్లాక్, రెడ్, బ్లూ, పింక్, వైట్, గ్రీన్, పర్పుల్, గ్రే రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.





Untitled Document
Advertisements