దినేశ్ కార్తీక్ కెప్టెన్సీని వదులుకోడానికి కారణం, గంభీర్ సంచలనం!

     Written by : smtv Desk | Sat, Oct 17, 2020, 02:09 PM

దినేశ్ కార్తీక్ కెప్టెన్సీని వదులుకోడానికి కారణం, గంభీర్ సంచలనం!

బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టడం కోసం కెప్టెన్సీని వదిలేస్తున్నట్లు కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ బాధ్యతలను ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ చేపట్టాడు . బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టడం కోసం తాను కెప్టెన్సీని వదిలేస్తున్నట్లు కార్తీక్ చెప్పుకొచ్చాడు. కానీ అసలు నిజం అది కాదని కోల్‌కతా మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచిన గంభీర్.. సీజన్ మధ్యలో కెప్టెన్ మారడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్నాడు. ‘‘క్రికెట్ అనేది రిలేషన్‌షిప్స్‌కు సంబంధించిన అంశం కాదు. నిజాయతీగా చెప్పాలంటే ఆటతీరుకు సంబంధించింది. మోర్గాన్ కెప్టెన్ కావడం వల్ల పెద్ద మార్పు వస్తుందని నేను అనుకోవడం లేదు. లీగ్ ప్రారంభంలోనే మోర్గాన్‌ను కెప్టెన్‌గా నియమించి ఉంటే అతడు ఎన్నో మార్పులు చేయడానికి అవకాశం ఉండేది. కానీ సీజన్ మధ్యలో ఎవరేం మార్చలేరు. కోచ్, కెప్టెన్ మధ్య సత్సంబంధాలు ఉండటం మంచిది’’ అని గంభీర్ స్టార్ స్పోర్ట్స్‌తో తెలిపాడు. గత రెండేళ్లకుపైగా కార్తీక్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సీజన్ మధ్యలో కెప్టెన్‌ను మార్చేంత చెత్తగా కోల్‌కతా ప్రదర్శనేం లేదు. అందుకే కెప్టెన్సీ మార్పు గురించి తెలియగానే ఆశ్చర్యపోయానని గంభీర్ తెలిపాడు. వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ జట్టులో ఉన్నాడని పదే పదే మాట్లాడి దినేశ్ కార్తీక్‌పై ఒత్తిడి పెంచే బదులు ముందుగానే మోర్గాన్‌కు కెప్టెన్సీ అప్పగించాల్సిందని గంభీర్ వ్యాఖ్యానించాడు. కార్తీక్ తన బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టడం కోసమే కెప్టెన్సీ వదులుకున్నానని చెబుతున్నా.. అతడి నాయకత్వం పట్ల తాము సంతృప్తిగా లేమని.. మేనేజ్‌మెంట్ నుంచి పదే పదే ఫిల్లర్లు రావడమే కార్తీక్ నిర్ణయానికి కారణమై ఉంటుందని భావిస్తున్నట్లు గంభీర్ తెలిపాడు.





Untitled Document
Advertisements