కస్టమర్లకు SBI అలెర్ట్, జాగ్రత్త...లేదంటే అకౌంట్‌లో డబ్బులు మాయం

     Written by : smtv Desk | Sat, Oct 17, 2020, 04:15 PM

కస్టమర్లకు SBI అలెర్ట్, జాగ్రత్త...లేదంటే అకౌంట్‌లో డబ్బులు మాయం

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తన కస్టమర్లను హెచ్చరించింది. మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఏటీఎం మోసాలతోపాటు ఆన్‌లైన్ మోసాలతో కూడా జాగ్రత్తగా ఉండాలని, మోసగాళ్లు ఎలాగైనా మోసాలు చేయొచ్చని కస్టమర్లకు సూచించింది. ఎస్‌బీఐ కస్టమర్లు వారి బ్యాంక్ అకౌంట్‌ను భద్రంగా ఉంచుకోవడానికి పలు టిప్స్ ఇచ్చింది. అలాగే కొన్ని తప్పులు చేయవద్దని అలర్ట్ చేసింది. పండుగ సీజన్ నేపథ్యంలో తప్పులు చేస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవ్వొచ్చని హెచ్చరించింది. ముఖ్యంగా ఐదు తప్పులు చేయవద్దని సూచించింది.

1. వన్ టైమ్ పాస్‌వర్డ్ OTP, పిన్ నెంబర్, క్రెడిట్ కార్డు/ డెబిట్ కార్డులపై ఉంటే సీవీవీ నెంబర్, యూపీఐ పిన్ వంటి వాటిని ఎవ్వరికీ షేర్ చేయవద్దని, చెప్పవద్దని సూచించింది. బ్యాంక్ అధికారులు కాల్ చేసి కార్డు, అకౌంట్ వివరాలు అడగరని గుర్తించుకోవాలి.

2. ఎవరైనా కాల్ చేసి పాస్ వర్డ్ మారుస్తున్నామని, మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ లేదా కార్డుపై ఉంటే సీవీవీ నెంబర్ చెప్పమని అడిగితే కాల్ కట్ చేయండి. కొంత మంది కార్డు బ్లాక్ అవుతుందంటూ హెచ్చరిస్తూ కార్డు వివరాలు తెలియజేయాలని కోరవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనూ జాగ్రత్తగా ఉండాలి.

3. స్మార్ట్‌ఫోన్‌లో బ్యాంక్ అకౌంట్ వివరాలను సేవ్ చేసుకోవద్దు. పాస్‌వర్డ్, ఏటీఎం కార్డు నెంబర్, అకౌంట్ నెంబర్ వంటివి ఫోన్‌లో పెట్టుకోవద్దు.

4. ఏటీఎం కార్డు వివరాలను ఎవ్వరికీ తెలియజేయవద్దు. మీరు మాత్రమే మీ కార్డును ఉపయోగించండి. ఒకవేళ ఎవరికైనా ఏటీఎం కార్డు వివరాలు చెబితే మీ అకౌంట్ ఖాళీ అయ్యే ప్రమాదముంది.

5. పబ్లిక్ డివైజ్‌లలో ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించొద్దు. అంటే మీ స్మార్ట్‌ఫోన్ లేదా ల్యా్ప్‌టాప్ కాకుండా ఇతర ఫోన్, ల్యాప్‌టాప్‌లలో బ్యాంక్ లావాదేవీలు చేయొద్దు.

Untitled Document
Advertisements