పోలీసుల దెబ్బలకి మహిళ మృతి, స్టేషన్ ఖాళీ

     Written by : smtv Desk | Sat, Oct 17, 2020, 07:56 PM

పోలీసుల దెబ్బలకి మహిళ మృతి, స్టేషన్ ఖాళీ

నల్గొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పోలీసుల దెబ్బలకు ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గం అడవిదేవులపల్లిలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సక్రి(55) అనే మహిళ నాటు సారా విక్రయిస్తుందని పోలీసులు పట్టుకెళ్లారు. అనంతరం వారు ఆమెను కొట్టినట్లు తెలుస్తోంది. చివరికి సక్రి మృతి చెందింది. పోలీసులు తీసుకువెళ్లి కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక సక్రి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. ఆ స్టేషన్లో పనిచేసే పోలీసులు పోలీస్ స్టేషన్ తలుపులు మూసి అక్కడి నుండి వెళ్లి పోయారు. పోలీసులకు వ్యతిరేకంగా బాధితులు నినాదాలు చేశారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని వృద్ధురాలి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నాధికారులను ఆశ్రయిస్తామని చెబుతున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించమని స్పష్టం చేశారు. పోలీసుల తీరుపై స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటివరకు ఈ ఘటనపై పోలీసులు అధికారులు స్పందించలేదు.

Untitled Document
Advertisements