ఆ రీమేక్ నుంచి తప్పుకున్న పవర్‌స్టార్?

     Written by : smtv Desk | Tue, Oct 20, 2020, 01:00 PM

ఆ రీమేక్ నుంచి తప్పుకున్న పవర్‌స్టార్?

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ పింక్ రీమేక్‌లో నటిస్తుండగా ఈ క్రమంలోనే మరో మలయాళ సూపర్‌హిట్ ‘అయ్యప్పన్నుమ్ కొషియుమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ సినిమాలో పవన్‌తో పాటు రానా కూడా నటిస్తున్నట్లు టాక్ వినిపించింది. తొలుత ఈ సినిమాలో రవితేజ, రానా కలిసి నటించాలనుకున్నారని, సాగర్ చంద్ర డైరెక్టర్‌గా ఓకే అయినట్లు వార్తలొచ్చాయి. అయితే రవితేజ వరుస సినిమాలతో బిజీగా మారడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందట. దీంతో ఈ రీమేక్‌పై పవన్ ఆసక్తి చూపించారని, యూనిట్ ఆయన్ని కలిసి స్ర్కిప్ట్ వినిపించగా ఓకే చెప్పేశారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ‘అయ్యప్పన్నుమ్ కొషియుమ్’ రీమేక్ నుంచి పవన్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్‌ నటిస్తున్న వకీల్ సాబ్ షూటింట్ చివరి దశలో ఉంది. ఆ తర్వాత క్రిష్ సినిమాతో పాటు మరో సినిమాలోనూ ఆయన నటించాల్సి ఉంది. ఆ సినిమాలు పూర్తయ్యేసరికి చాలా టైమ్ పట్టే అవకాశం ఉండటంతో తన కోసం యూనిట్ అంత కాలం వేచి ఉండటం ఇష్టం లేకే పవన్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.





Untitled Document
Advertisements