తైవాన్‌ కోసం చైనా పన్నాగాలు

     Written by : smtv Desk | Tue, Oct 20, 2020, 06:10 PM

తైవాన్‌ కోసం చైనా పన్నాగాలు

తైవాన్‌ చేజిక్కించుకునేందుకు చైనా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఆగ్నేయ తీరంలో సైనికులను మోహరిస్తోంది. అలాగే, అధునాత యుద్ధ సామాగ్రిని ఆ ప్రాంతానికి తరలిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. చైనా సైన్యం తాజాగా తన పాత డీఎఫ్‌-11, డీఎఫ్‌-15 క్షిపణులను తొలగించి, అధునాతనమైన హైపర్‌సోనిక్‌ డీఎఫ్‌-17 క్షిపణులను ఈ ప్రాంతంలో మోహరిస్తోంది. సుదూరంలోని లక్ష్యాలను ఖచితత్వంగా ఛేదించే సామర్థ్యం ఈ క్షిపణుల సొంతం. వాస్తవానికి తైవాన్‌ ఎన్నడూ చైనా పాలన కిందలేదు.. అక్కడ స్వయం పాలనే కొనసాగుతోంది. అయినా అది తమ దేశంలో అంతర్భాగమని చైనా వాదిస్తోంది. తైవాన్‌ను హస్తతం చేసుకునేందుకు సైనిక చర్య అవకాశాన్ని కొట్టిపారేయలేమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ వ్యాఖ్యానించారు. ఆ ప్రాంతంలోని ఫుజియాన్‌, గువాంగ్‌డాంగ్‌లోని మెరీన్‌ కోర్‌, రాకెట్‌ ఫోర్స్‌ బలగాలను డ్రాగన్‌ భారీగా పెంచినట్లు కెనడాకు చెందిన కన్వా డిఫెన్స్ రివ్యూ ఉపగ్రహ చిత్రాలను బట్టి స్పష్టమవుతోంది. ఈ రెండు స్థావరాలు ప్రస్తుతం ఆయుధాలతో నిండిపోయిందని నివేదిక పేర్కొంది. తూర్పు, దక్షిణ థియేటర్ కమాండర్ ఆదేశాలతో ఈ క్షిపణి స్థావరాల పరిమాణం ఇటీవలి సంవత్సరాలలో రెట్టింపయ్యింది.. తైవాన్‌ను లక్ష్యంగా చేసుకుని యుద్ధానికి సీపీఎల్ఏ సన్నాహాలు చేస్తున్నట్లు అర్దమవుతోంది అని వ్యాఖ్యానించింది.

కొవిడ్‌-19, తైవాస్ సహా ఇతర అంశాలపై అమెరికా- చైనాల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. మంగళవారం గువాంగ్‌ డాంగ్‌లోని ఒక సైనిక స్థావరాన్ని సందర్శించిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌.. యుద్ధ సన్నద్ధత కోసం సర్వశక్తులను కూడగట్టాలని బలగాలకు పిలుపునిచ్చారు. యుద్ధానికి సన్నద్ధం కావడంపైనే మీ శక్తియుక్తులు, దృష్టినంతటినీ కేంద్రీకరించండి. అత్యంత అప్రమత్తంగా ఉండండి. దేశానికి పూర్తిస్థాయి స్వచ్ఛంగా, విధేయులుగా ఉండండి’ అని సైనిక దళాలకు స్పష్టం చేశారని సీఎన్ఎన్ వెల్లడించింది.





Untitled Document
Advertisements