ప్రభాష్ బర్త్ డే సీడీపీ రిలీజ్

     Written by : smtv Desk | Tue, Oct 20, 2020, 07:51 PM

ప్రభాష్ బర్త్ డే సీడీపీ రిలీజ్

తమ ఫేవరైట్ హీరో పుట్టినరోజు అంటే అభిమానులకు అంతకన్నా పెద్ద పండగ రోజు ఉండదు. కేట్ కటింగ్స్, భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం లాంటివి చేస్తూ ఆనందోత్సహాల్లో మునిగితేలుతుంటారు ఫ్యాన్స్. అయితే ఈ మధ్యకాలంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కడం, దేశంలోని ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి రావడంతో మరో అడుగు ముందుకేసి (కామన్ డిస్ప్లే పిక్చర్) CDP లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో మూడు రోజుల్లో అనగా అక్టోబర్ 23వ తేదీన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన బర్త్ డే సీడీపీ రిలీజ్ చేశారు. ఇక సంబరాలు షురూ అంటూ ప్రభాస్ రేంజ్ తెలిపేలా బర్త్ డే సీడీపీని బయటకు వదిలారు. ఈ బర్త్ డే సీడీపీని పరిశీలిస్తే.. ఇందులో అశేష అభిమానుల నడుమ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్‌ని చూపిస్తూ వరల్డ్ స్టార్ కీర్తిని చాటిచెప్పే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. దీంతో ఈ సీడీపీ నెట్టింట వైరల్ అవుతోంది. ఆయనకు పెద్ద ఎత్తున అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్. ఇకపోతే ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన బాహుబలి 2 చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాతోపాటు దేశంలో కూడా ఈ సినిమాను అక్టోబర్ 23వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

Untitled Document
Advertisements