వన్ ప్లస్ 9 కోడ్‌నేమ్ లీక్

     Written by : smtv Desk | Tue, Oct 20, 2020, 07:52 PM

వన్ ప్లస్ 9 కోడ్‌నేమ్ లీక్

వన్ ప్లస్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన వర్క్ అప్పుడే ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ టిప్ స్టర్ లీక్ చేశారు. లీకైన ఇమేజీలో ఈ ఫోన్ పక్కనుంచి కనిపిస్తోంది. దీని బ్యాక్‌గ్రౌండ్‌లో ‘Lemonade' అని పసుపు రంగులో రాసి కనిపిస్తుంది. ఇది వన్ ప్లస్ 9కు కోడ్ నేమ్ అని కింద రాశారు. దీనికి సంబంధించిన మరో లీకులో కూడా ఇలాంటి పేరునే తెలిపారు. దీనికి సంబంధించి మిగతా వివరాలు తెలియరాలేదు. అయితే త్వరలో ఇవి బయటకు వచ్చే అవకాశం ఉంది. వన్ ప్లస్ 9 స్మార్ట్ ఫోన్ ఇమేజీని మ్యాక్స్ జే. అనే టిప్ స్టర్ లీక్ చేశారు. ఈ స్మార్ట్ ఫోనే వన్ ప్లస్ 9 అయ్యే అవకాశం ఉంది. ఈ ట్వీట్‌లో అంతకు మించి వివరాలను వెల్లడించలేదు. లెమనేడ్, లెమనడెప్, లెమనడెప్ట్, లెమనడెవ్ అనే కోడ్‌నేమ్‌లతో వన్ ప్లస్ 9 వచ్చే అవకాశం ఉందని గతవారం ఒక లీక్ బయటకు వచ్చింది. దీన్ని బట్టి ఇందులో చాలా వేరియంట్లు ఉండే అవకాశం ఉంది. వన్ ప్లస్ 9 సిరీస్ ఫోన్లు 2021 ఏప్రిల్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

వన్ ప్లస్ 8టీ లాంచ్ అయిన వారంలోనే ఈ వార్తలు రావడం విశేషం. ఇందులో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ అందుబాటులో ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

వన్ ప్లస్ ఈ సంవత్సరం జులైలో నార్డ్ అనే స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ చేసింది. దీని ధర కూడా తక్కువగానే ఉంది. ఇందులో కూడా వెనకవైపు నాలుగు కెమెరాలనే అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్‌గా ఉంది. 5జీ ఫీచర్ కూడా ఇందులో ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. వన్ ప్లస్ సహ వ్యవస్థాపకులు కార్ల్ పెయ్ కంపెనీని వదిలి కొన్ని రోజులు మాత్రమే అయింది. అతని ప్రమేయం లేకుండా లాంచ్ అవుతున్న మొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. మరి ఈ ఫోన్ కూడా ఇంతకుముందు ఫోన్లలాగా సక్సెస్ అవుతుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి.





Untitled Document
Advertisements