సెహ్వాగ్‌కు రైనా బర్త్ డే విషెస్, వీరూ రిప్లై!

     Written by : smtv Desk | Tue, Oct 20, 2020, 08:02 PM

సెహ్వాగ్‌కు రైనా బర్త్ డే విషెస్, వీరూ  రిప్లై!

టీమిండియా మాజీ క్రికెటర్.. డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పుట్టిన రోజు నేడు (అక్టోబర్ 20). ఈ సందర్భంగా వీరూకు క్రికెటర్లు, ఫ్యాన్స్ బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, క్రికెట్ గాడ్ సచిన్, లక్ష్మణ్, యువరాజ్, రైనా, గేల్, మయాంక్ తదితర క్రికెటర్లు వీరూకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేశారు. సెహ్వాగ్ ఫ్యామిలీతో.. రైనా దంపతులు దిగిన ఫొటోతో సురేశ్ రైనా విష్ చేశాడు. ‘‘హ్యాపీ బర్త్ డే వీరూ బాయ్. నాకు పెద్దన్న, నాలో ఎప్పుడూ స్ఫూర్తి నింపడంతోపాటు జీవితంలో మార్గదర్శిగా నిలిచావ్. నీకంతా మంచి జరగాలని కోరుకుంటున్నా’’ అని రైనా ట్వీట్ చేశాడు. దీనికి వీరూ స్పందిస్తూ.. ‘‘థ్యాంక్యూ సురేశ్. ఈ ఐపీఎల్‌లో నిన్నెంతో మిస్సయ్యాం. నువ్వు త్వరగా తిరిగొస్తావని ఆశిస్తున్నా’’ అని బదులిచ్చాడు. ‘సిక్సర్లు, ఫోర్లతో మాత్రమే డీల్ చేసే సెహ్వాగ్ 42వ ఏట అడుగుపెడుతున్నాడు. ఇది కూడా 6 వస్తుంది. వందేళ్లు వర్థిల్లు. జన్మదిన శుభాకాంక్షలు సెహ్వాగ్’ అని సచిన్ ట్వీట్ చేయగా.. ‘‘థ్యాంక్యూ గాడ్ జీ.. మీరు వందలతోనే (సెంచరీలతో) డీల్ చేస్తారు. క్రికెట్‌కు మీరు చేసిన సేవల్ని వర్ణించడానికి అంకెలు సరిపోవు. స్ఫూర్తిగా నిలిచినందుకు.. శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు’’ అని వీరూ బదులిచ్చాడు.


Untitled Document
Advertisements