డ్రమ్ బ్రేక్ సెటప్ తో వస్తున్న పల్సర్ 125

     Written by : smtv Desk | Tue, Oct 20, 2020, 08:05 PM

డ్రమ్ బ్రేక్ సెటప్ తో వస్తున్న పల్సర్ 125

పల్సర్ బైక్ వస్తుందంటే.. కుర్రకారు పల్స్ అమాంతం పెరిగిపోతుంది. ఎన్ని మోటార్ సైకిళ్లు భారత మార్కెట్లో విడుదలైనా పల్సర్ కుండే క్రేజ్ మాత్రం వేరే లెవల్. తాజాగా బజాజ్ సంస్థ సరికొత్త పల్సర్ మోడల్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. అదే పల్సర్ 125 స్ప్లిట్-సీట్ డ్రమ్ బ్రేక్ వేరియంట్. ఎక్స్ షోరూంలో ఈ బైక్ ప్రారంభ దర వచ్చేసి రూ.73,274లుగా సంస్థ నిర్దేశించింది. ఈ సరికొత్త పల్సర్ 125 స్ప్లిట్ మోడల్ డిజైన్, ఫీచర్లు వచ్చేసి టాప్ స్పెక్ వేరియంట్ బ్రేకింగ్ హార్డ్ వేర్ మాదిరే ఉంది. ఈ ఎంట్రీ లెవల్ మోడల్.. 170 ఎంఎం ఫ్రంట్, 130 ఎంఎం రేర్ డ్రమ్ బ్రేక్ సెటప్ తో అందుబాటులోకి వచ్చింది. టాప్ వేరియంట్ బజాజ్ పల్సర్ 125 స్ప్లిట్ సీట్ మోడల్ 240 ఎంఎం డిస్క్ బ్రేక్ ను కలిగి ఉండి.. 130 ఎంఎం డ్రమ్ బ్రేక్ ను కలిగిఉంది. ఈ రెండి వేరియంట్లు స్టాండర్డ్ కంబైన్డ్ బ్రేకింగ్ వ్యవస్థను కలిగిఉన్నాయి. అయితే డిస్క్ బ్రేక్ వేరియంట్ తో పోలిస్తే ఈ డ్రమ్ బ్రేక్ పల్సర్ 125 మోడల్ ధర రూ.7000లు తగ్గింది. రెండింట్లోనూ రెండు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ రెండు మోడళ్లు బ్లాక్-రెడ్, బ్లాక్ సిల్వర్ కలర్స్ లో లభ్యమవుతాయి. ఒరిజినల్ డిజైన్ తో అందుబాటులోకి వచ్చే వరియంట్లలో బజాజ్ పల్సర్ 125 అత్యంత ఒరిజనల్ బ్రాండ్ రేంజ్ ను కలిగి ఉంది. గత 15 ఏళ్ల నుంచి ఇదే డిజైన్ తో బైక్ ప్రియులను ఆకట్టుకుంది. పల్సర్ 125 డ్రమ్ బ్రేక్ వేరియింట్ ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనక భాగంలో అడ్జస్టబుల్ ట్విన్ గ్యాస్ షాక్ అబ్జార్బర్లు, మోటార్ సైకిల్ ఎక్విప్డ్ అల్లాయ్ వీల్స్ తో పాటు రెండు వైపులా ట్యూబ్ లెస్ టైర్లను కలిగి ఉంది. బజాజ్ పల్సర్ 125 స్ప్లిట్ సీట్ డ్రమ్ బ్రేక్ వేరియంట్లో రెండు పిల్లియట్ ల్యాంపులు, ఎల్ఈడీ టెయిల్ ల్యాంపులు, ట్యాంకు ష్రౌడ్లు, సెమీ డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్, 11.5 లీటర్ ఫ్యూయల్ ట్యాంకు, ఇంజిన్ కౌల్, బ్లాక్డ్ అవుట్ మస్కూలర్ లుకింగ్ ఎక్సాహాస్ట్, స్ప్లిట్ గ్రాబ్ రెయిల్స్, క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్లను కలిగి ఉంది. ఇవి కాకుండా సూటబుల్ గ్రాఫిక్స్ ఇంజిన్ కౌల్, బ్యాడ్జింగ్ అల్లాయ్ వీల్స్ గ్రాబ్ రెయిల్స్ ను ఇందులో ఉన్నాయి. బజాజ్ పల్సర్ 125 మోడల్ ఎయిర్ కూల్డ్ 124.4సీసీ డీటీఎస్-ఐ ఇంజిన్ కలిగి ఉండి 11.3 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 10.8 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. భారత మార్కెట్లో ఈ బైక్ కు పోటీగా హోండా ఎస్125, హీరో గ్లామర్ బైక్స్ ఉన్నాయి.





Untitled Document
Advertisements