భారత్ లోకి ప్రవేశించిన చైనా సైనికుడిని అప్పగించిన ఆర్మీ

     Written by : smtv Desk | Wed, Oct 21, 2020, 11:09 AM

భారత్ లోకి ప్రవేశించిన చైనా సైనికుడిని అప్పగించిన ఆర్మీ

భారత భూభాగంలోకి ప్రవేశించిన చైనా సైనికుడిని భారత్‌ మంగళవారం రాత్రి అప్పగించింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రోటోకాల్‌ ప్రకారం బుధవారం చుషూల్‌-మోల్దో మీటింగ్‌ పాయింట్‌ వద్ద అయన్ని చైనా బలగాలకు అప్పగించినట్లు పేర్కొంది. సైనికుడిని తిరిగి విధుల్లోకి చేర్చుకునే ముందు క్షుణ్ణంగా తనిఖీ చేసి పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.
తమ జవాన్‌ను అప్పగించాలంటూ మంగళవారమే చైనా.. భారత్‌కు విజ్ఞప్తి చేసింది. తప్పిపోయిన తన జడల బర్రెను వెతికిపెట్టాలన్న స్థానికుడి విజ్ఞప్తి మేరకు అతడు పొరపాటున సరిహద్దు దాటిన చైనా సైనికుడిని ఆర్మీ సోమవారం దేమ్‌చోక్ సెక్టార్ వద్ద అదుపులోకి తీసుకుంది. అతడి వద్ద లభించిన గుర్తింపు కార్డు ఆధారంగా షీజియాంగ్ ప్రావిన్సుల్లోని షాగ్జింజన్ పట్టణానికి చెందిన పీఎల్ఏ‌కు చెందిన సైనికుడు వాంగ్ యా లాంగ్‌గా గుర్తించారు.

వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రోటోకాల్‌ను అనుసరించి అప్పగిస్తామని భారత్ హామీ ఇచ్చింది. చెప్పినట్టుగానే అతడిని చైనా ఆర్మీకి తిరిగి అప్పగించింది. తూర్పు లడఖ్‌ సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.





Untitled Document
Advertisements