అందుబాటులోకి గూగుల్ మీట్ కొత్త ఫీచర్

     Written by : smtv Desk | Fri, Nov 20, 2020, 07:05 PM

అందుబాటులోకి గూగుల్ మీట్ కొత్త ఫీచర్

గూగుల్ మీట్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా మీటింగ్‌లో పాల్గొనేవారు తమ చేతిని వర్చువల్‌గా ఎత్తి ప్రశ్నలు అడగవచ్చు లేదా వారు మాట్లాడాలనుకున్నది మాట్లాడవచ్చు. దీనికి సింబాలిక్‌గా చేయెత్తే బటన్‌ను ప్రత్యేకంగా అందించారు. దీనికి ‘రైజ్ హ్యాండ్’ అనే పేరు పెట్టారు. మీటింగ్‌లో ఉన్నప్పుడు ఒకరి కంటే ఎక్కువమంది చేయెత్తితే మీటింగ్ నిర్వహించేవారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వవచ్చు. ఒకవేళ మీరు రైజ్ హ్యాండ్ ఫీచర్‌ను కాన్ఫరెన్స్ సమయంలో ఉపయోగించినట్లుయితే.. ఎత్తిన చేతిని దించేందుకు లోయర్ హ్యాండ్ బటన్‌ను కూడా ఇందులో అందించారు. ఈ విషయాన్ని గూగుల్ తన బ్లాగ్ పోస్టులో వెల్లడించింది. మీటింగ్ నిర్వాహకులు కూడా వ్యక్తుల చేతులను ఆటోమేటిక్‌గా దించవచ్చు. ఒకవేళ మీటింగ్ నిర్వాహకులు లోయర్ హ్యాండ్ బటన్‌పై క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది.

ఎవరైనా ఒకరు చేయి ఎత్తినా మీటింగ్‌లో ఉన్న వారందరికీ నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతానికి అర్హులైన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్, వెబ్ వెర్షన్లలో కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్ ఇప్పటిక్ రోల్‌అవుట్ ప్రారంభం అయింది. అందరికీ చేరడానికి రెండు వారాలు పట్టవచ్చు. గూగుల్ మీట్ ప్రధాన ప్రత్యర్థి జూమ్‌లో ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది.

గూగుల్ మీట్‌లో ఎవరైనా వ్యక్తి చేయి ఎత్తితే మీటింగ్ నిర్వాహకులు దాన్ని వీడియో ప్రివ్యూలో చూడగలరు. ఒకవేళ మోడరేటర్ మరో ట్యాబ్ ఓపెన్ చేసి ఉంటే.. వారికి సౌండ్ నోటిఫికేషన్ వెళ్తుంది. ఈ రైజ్ హ్యాండ్ ఫీచర్ వ్యక్తిగత గూగుల్ అకౌంట్లకు, వర్క్‌స్పేస్ బిజినెస్ స్టార్టర్ ప్లాన్లకు, జీసూట్ బేసిక్ వినియోగదారులకు అందుబాటులో లేదు. వర్క్ స్పేస్ ఎసెన్షియల్స్, బిజినెస్ స్టాండర్డ్, బిజినెస్ ప్లస్, ఎంటర్ ప్రైజ్ ఎసెన్షియల్స్, ఎంటర్ ప్రైజ్ స్టాండర్డ్, ఎంటర్ ప్రైజ్ ప్లస్, జీసూట్ బిజినెస్, ఎడ్యుకేషన్, ఎంటర్ ప్రైజ్ ఫర్ ఎడ్యుకేషన్, నాన్ ప్రాఫిట్ ప్లాన్లకు అందుబాటులోకి రానుంది.

గూగుల్ తన వీడియో కాన్ఫరెన్సింగ్ సర్వీస్ అయిన గూగుల్ మీట్‌కు గత కొన్ని నెలల్లో ఎన్నో ఫీచర్లు అందించింది. వీడియో కాల్‌లో ఉండగానే వినియోగదారులు తమ బ్యాక్ గ్రౌండ్ మార్చుకునే ఫీచర్ కూడా ఇందులో ఉంది.





Untitled Document
Advertisements