కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోవాలి....ఫ్యాన్స్ డిమాండ్

     Written by : smtv Desk | Mon, Nov 30, 2020, 08:38 AM

కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోవాలి....ఫ్యాన్స్ డిమాండ్

భారత్‌తో జరిగిన తొలి వన్డేలో 6 వికెట్ల నష్టానికి 374 రన్స్ చేసిన ఆస్ట్రేలియా.. రెండో వన్డేలో 4 వికెట్ల నష్టానికి 389 పరుగులు చేసింది. రెండు మ్యాచ్‌ల్లోనూ ఓపెనర్లు శతక భాగస్వామ్యాలు నెలకొల్పగా.. స్మిత్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో చెలరేగాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ చెలరేగుతుంటే.. భారత బౌలర్లు నిస్సహాయులైపోయారు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఆసీస్ 370కిపైగా పరుగులు చేయడంతో.. క్రికెట్ ఫ్యాన్స్ ట్విట్టర్లో ‘కెప్టెన్సీ’పై చర్చ జరుపుతున్నారు.
కొందరు అభిమానులు కోహ్లి కెప్టెన్సీని విమర్శిస్తుండగా.. మరికొందరు కోహ్లికి బాసటగా నిలుస్తున్నారు. కొంత కాలంగా పరిమిత ఓవర్ల కెప్టెన్సీ పగ్గాలను రోహిత్‌కు అప్పగించాలనే డిమాండ్ తెర మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆసీస్‌తో జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ బౌలర్లు దారుణంగా విఫలం కావడంతో.. మరోసారి కెప్టెన్సీ అంశం తెర మీదకు వచ్చింది.

‘‘కోహ్లి అద్భుతమైన ఆటగాడే కానీ.. కెప్టెన్‌గా రాణించలేకపోతున్నాడు.. అతడి వ్యూహాలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు.. అతడు కెప్టెన్సీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలి’’ అని కొందరు ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ధోనీ, రోహిత్ జట్టులో లేని వేళ అతడి వ్యూహాలు తేలిపోతున్నాయని కామెంట్ చేస్తున్నారు.

రెండో వన్డేలో ఆఖరి ఓవర్ బౌలింగ్ చేసే బాధ్యతను సైనీకి అప్పగించడం పట్ల కూడా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. షమీ, పాండ్యను కాదని కోహ్లి సైనీతో బౌలింగ్ చేయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జట్టులో షమీ, బుమ్రా, చాహల్ లాంటి బౌలర్లు ఉన్నా.. వ్యూహరచనలో కోహ్లి ఆకట్టుకోలేకపోతున్నాడని ట్వీట్లు చేస్తున్నారు.





Untitled Document
Advertisements