దేవుళ్ల విగ్రహాల ధ్వంసంపై ఆగ్రహం వ్యక్తం చేసిన యామిని సాధినేని

     Written by : smtv Desk | Mon, Jan 04, 2021, 04:16 PM

దేవుళ్ల విగ్రహాల ధ్వంసంపై ఆగ్రహం వ్యక్తం చేసిన యామిని సాధినేని

బీజేపీ నేత యామిని సాధినేని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏపీలో తాజా పరిణామాలు చూస్తుంటే బాధగా ఉందని.. ఇలాంటి చర్యల పట్ల వర్ణించలేని మానసిక క్షోభకు గురవుతున్నాము అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల జరిగిన దేవుళ్ల విగ్రహాల ధ్వంసంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశారు. విగ్రహాల ధ్వంసాన్ని ఆపడానికి ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఏదైనా ఒక రాజకీయ నాయకుడి విగ్రహం జోలికి వెళ్తే అట్టుడికిపోతారని.. కానీ దేవుళ్ల విగ్రహాలు విధ్వంసం జరుగుతున్నా ఎందుకు స్పందించట్లేదని, చేవలేని, చేతగాని, చచ్చిపోయిన హిందూ సమాజం ఏపీలో ఉందా అనే పరిస్థితులు దాపురించాయన్నారు. ప్రజలు, ప్రభుత్వ ఆస్తులను మాత్రమే కాపాడటం మాత్రమే తమ బాధ్యతగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని.. దేవాలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత సైతం ప్రభుత్వంపై ఉందన్నారు. దాడులను అడ్డుకోవడానికి హిందువుల ఐక్యంగా ఉద్యమించాలన్నారు.

రాష్ట్రంలో విగ్రహాలను ధ్వంసం చేయడానికి ప్రభుత్వం చూసీ చూడనట్టు వ్యవహరిస్తోందని యామిని మండిపడ్డారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలను తీసుకోకపోవడం వల్ల వాటిని ప్రోత్సహించినట్లు అవుతోందన్నారు. ఏపీలో హిందువులందరూ చచ్చిపోయారని అనుకుంటున్నారా? వాటిని అడ్డుకోలేరని ప్రభుత్వం భావిస్తోందా? అంటూ ప్రశ్నించారు. విగ్రహాలను ధ్వంసం చేసేవారికి తగిన బుద్ది చెప్పాలన్నారు. ఈ దారుణాలను చూసి భరించే ఓపిక హిందువులకు లేదని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.







Untitled Document
Advertisements