ఎస్‌బీఐ మిస్డ్ కాల్ సర్వీసులు...కాల్‌తో బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు!

     Written by : smtv Desk | Tue, Jan 05, 2021, 11:59 AM

ఎస్‌బీఐ మిస్డ్ కాల్ సర్వీసులు...కాల్‌తో బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు!

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBIలో మీకు అకౌంట్ ఉందా? అయితే ఆ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవాలని భావిస్తున్నారా? అయితే దీని కోసం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. సులభంగానే బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు ఎంత ఉన్నాయో తెలుసుకోవచ్చు.

బ్యాంక్ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవడానికి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తప్పనిసరి. అంటే మీ బ్యాంక్ అకౌంట్‌లో లింక్ అయిన మొబైల్ నెంబర్ మీ వద్దనే ఉండాలి. అప్పుడు మీరు ఈజీగా అకౌంట్‌లో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవచ్చు.

మీరు ఒక్క మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్‌బీఐ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు 9223766666 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. మీరు కాల్ చేసి కట్ చేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉందో ఎస్ఎంఎస్ వస్తుంది.

అయితే మీరు ఎస్‌బీఐ క్విక్ సర్వీసులకు రిజిస్టర్ చేసుకుంటేనే మిస్డ్ కాల్ ఇచ్చిన వెంటనే మీకు బ్యాలెన్స్ ఎస్ఎంఎస్ వస్తుంది. ఒకవేళ రిజిస్టర్ చేసుకోకపోతే.. రిజిస్టర్ చేసుకోవాలని ఎస్ఎంఎస్ వస్తుంది. మీరు REG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి అకౌంట్ నెంబర్ టైప్ చేసి 7208933148 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఎస్‌బీఐ క్విక్ ఫెసిలిటీని పొందొచ్చు.





Untitled Document
Advertisements