షాకింగ్: డార్క్ వెబ్‌లో 10 కోట్ల కార్డుల వివరాలు

     Written by : smtv Desk | Tue, Jan 05, 2021, 02:06 PM

షాకింగ్: డార్క్ వెబ్‌లో 10 కోట్ల కార్డుల వివరాలు

మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? లేదంటే డెబిట్ కార్డు ఉపయోగిస్తున్నారా? అయితే మీకు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. మీ కార్డుల వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్తోంది. ఎలా? అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి.

దేశంలో దాదాపు దాదాపు 10 కోట్ల క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల డేటా డార్క్ వెబ్‌లో వెల్లడి కాని మొత్తానికి అమ్మకం జరిగిందని ఇండిపెండెంట్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ రాజశేఖర్ రాజాహరియా తెలిపారు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వాడే వారికి ఇది ఆందోళన కలిగించే అంశమని చెప్పుకోవచ్చు.

బెంగళూరుకు చెందిన డిజిటల్ పేమెంట్స్ గేట్‌వే జస్ట్‌పే సర్వర్ ద్వారా ఈ డేటా తస్కరణ జరిగిందని రాజాహరియా తెలిపారు. అయితే సైబర్ ఎటాక్‌లో కార్డు నెంబర్లు కానీ లేదంటే ఇతర ఆర్థిక సమాచారం తస్కరణ జరగలేదని జస్ట్‌పే తెలిపింది. 2020 ఆగస్ట్ 18న తమ సర్వర్లపై అనధికార దాడి జరిగిందని, అయితే దీన్ని వెంటనే తమ తిప్పికొట్టామని వివరించింది.


కొన్ని డేటా రికార్డులు, ప్లెయిన్ టెక్ట్స్ ఈమెయిల్స్, ఫోన్ నెంబర్ల వివరాలు మాత్రమే వారి చేతికి వెళ్లాయని తెలిపింది. అయితే తస్కరణకు గురైన డేటాను క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ రూపంలో వెల్లడికాని డీల్‌కు డార్క్ వెబ్‌లో విక్రయించారని రాజాహరియా తెలిపారు.



హ్యాకర్లు కార్డు ఫింగర్‌ప్రింట్ జనరేట్ చేయడానికి హ్యాష్ అల్గరిథమ్‌ను ఉపయోగిస్తే.. అప్పుడు మాస్క్డ్ కార్డు నెంబర్‌ను డీక్రిప్ట్ చేయొచ్చని ఇలా జరిగితే 10 కోట్ల మంది రిస్క్‌లో ఉన్నట్లేనని రాజాహరియా వివరించారు. అయితే జస్ట్‌పే మాత్రం కార్డు వివరాలు లీక్ కాలేదని పేర్కొంటోంది.





Untitled Document
Advertisements