భారత క్రికెటర్లకి టీమిండియా మేనేజ్‌మెంట్ వార్నింగ్

     Written by : smtv Desk | Tue, Jan 05, 2021, 02:12 PM

భారత క్రికెటర్లకి టీమిండియా మేనేజ్‌మెంట్ వార్నింగ్

ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముంగిట భారత క్రికెటర్లకి టీమిండియా మేనేజ్‌మెంట్ గట్టి హెచ్చరికల్ని జారీ చేసింది. సిడ్నీ వేదికగా గురువారం నుంచి మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. మెల్‌బోర్న్ నుంచి సోమవారం సిడ్నీకి భారత్, ఆస్ట్రేలియా జట్లు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో.. ట్రైనింగ్‌కి మినహా ఎట్టి పరిస్థితుల్లో భారత క్రికెటర్లు హోటల్ వెలుపలికి వెళ్లకూడదని టీమిండియా మేనేజ్‌మెంట్ హెచ్చరికల్ని జారీ చేసింది. ఇటీవల మెల్‌బోర్న్‌లో ఐదుగురు భారత క్రికెటర్లు.. హోటల్ వెలుపలికి వెళ్లి ఓ రెస్టారెంట్‌లో ఫుడ్ తినడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

న్యూ ఇయర్ సందర్భంగా భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్, రిషబ్ పంత్, నవదీప్ సైనీ, పృథ్వీ షా ఓ రెస్టారెంట్‌కి వెళ్లి ఫుడ్ తిన్నారు. అయితే.. భారత క్రికెటర్లకి తెలియకుండా వారు ఫుడ్ తింటున్న వీడియోని రికార్డ్ చేసిన భారత అభిమాని.. బిల్ కూడా కట్టేసి వారిని ఆశ్చర్యపరిచాడు. అయితే.. భారత క్రికెటర్లు బిల్ డబ్బులు వెనక్కి తీసుకోవాలని అభిమానిని కోరగా.. అతను నిరాకరిస్తూ.. తనతో కలిసి ఫొటో దిగాలని కోరాడు. కానీ.. అందుకు నిరాకరించిన భారత క్రికెటర్లు.. హగ్ మాత్రం ఇచ్చినట్లు ఆ అభిమాని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అంతేకాకుండా.. క్రికెటర్లు ఫుడ్ తింటున్న వీడియో, బిల్‌ని కూడా పోస్ట్ చేసేయడంతో వివాదం రాజుకుంది.

భారత క్రికెటర్లు బయో- సెక్యూర్ బబుల్ రూల్‌ని బ్రేక్ చేసి.. రెస్టారెంట్‌కి వెళ్లడం.. అక్కడ అభిమానికి హగ్ ఇవ్వడాన్ని సీరియస్‌గా తీసుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ).. ఆ ఐదుగురు క్రికెటర్లని ఐసోలేషన్‌లో ఉంచింది. ఆ తర్వాత వారితో పాటు టీమ్ మొత్తానికీ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా.. అందరికీ నెగటివ్ రావడంతో టీమిండియా మేనేజ్‌మెంట్ ఊపిరి పీల్చుకుంది. దాంతో.. మరోసారి అదే తప్పిదం పునరావృతం కాకుండా ఉండేందుకు గట్టి చర్యలు తీసుకోవడంలో భాగంగా టీమిండియా మేనేజ్‌మెంట్ తాజాగా ఆటగాళ్లని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే.. స్టేడియంలోకి ప్రేక్షకుల్ని స్వేచ్ఛగా అనుమతిస్తున్న క్రికెట్ ఆస్ట్రేలియా.. ఇలా క్రికెటర్లని మాత్రం జూలో జంతువుల తరహాలో చూడటం బాధాకరమని టీమిండియా క్రికెటర్లలో కొంత మంది బాధపడినట్లు తెలుస్తోంది.





Untitled Document
Advertisements