ఈ ట్రిక్స్ తో మేకప్ లేకున్నా నేచురల్‌గానే కనిపిస్తారు!

     Written by : smtv Desk | Tue, Jan 05, 2021, 02:26 PM

ఈ ట్రిక్స్ తో మేకప్ లేకున్నా నేచురల్‌గానే కనిపిస్తారు!

పండగైన, పార్టీ అయినా, ఫంక్షన్ అయినా, పెళ్లి అయినా.... సందర్భం ఏదైనా అతివల మోము మేకప్ తో తలుక్కున మేరవాల్సిందే. అయితే కొంతమందికి మేకప్ వేస్కోవాలి అని ఉన్న హెవీగా కనిపిస్తుందేమో, లేదంటే నాకు సెట్ అవ్వదేమో, మేకప్ వేస్కున్నా నేచురల్‌గానే కనిపించాలి అని ఆలోచిస్తుంటారు.అయితే అలాంటివారికోసమే నో మేకప్ మేకప్ లుక్... పేరే వెరైటీగా ఉంటుంది కదా. మేకప్ వేసుకోవాలి, కానీ మేకప్ వేసినట్లు తెలియకూడదు. ఈ లుక్ ఇన్స్టా లుక్ మాత్రం కాదు. ఈ లుక్ లో ఫోకస్ అంతా అప్లికేషన్ మీదే ఉంటుంది, ప్రోడక్ట్స్ మీద కాదు. ఈ నో మేకప్ లుక్ కి కొన్ని టిప్స్, ట్రిక్స్ ఇక్కడ ఉన్నాయి. ఫాలో అయిపోండి మరి

ఈ లుక్ అంతా గ్లోయీ స్కిన్ మీదే బేస్ అయి ఉంది. స్కిన్ నాచురల్ గా ఉండాలి, మంచి గ్లో ఉండాలి. అదే ఇక్కడ గోల్. సో,ఇప్పుడు చేయాల్సిన పని ఒక మంచి హైడ్రేటింగ్ ఫేస్ మాస్క్ ని యూజ్ చేయడం. అప్పుడు స్కిన్ మేకప్ కి రెడీ అవుతుంది.
ఈ లుక్ లో ప్రైమర్ ఇంకో ఇంపార్టెంట్ పార్ట్. దీని వల్ల ఒక స్మూత్ బేస్ వస్తుంది. ఇందులో కూడా రకాలున్నాయి. పోర్స్ ఎక్కువగా ఉంటే పోర్ ఫిల్లింగ్ ప్రైమర్ చూజ్ చేసుకోవాలి. ఇది స్మూత్ గా ఉంటుంది, థిక్ ఫౌండేషన్ లాగా పోర్స్ ని క్లాగ్ చేయదు. అదే ఇల్యూమినేటింగ్ ప్రైమర్ వాడితే స్కిన్ లోపలి నుండి గ్లో వచ్చినట్లు ఉంటుంది. ఎక్స్ట్రా హైడ్రేటెడ్ గా కనిపిస్తుంది.
థిక్, ఫుల్ కవరేజ్ ఫౌండేషన్స్ ఈ లుక్ కి సూట్ కావు. టింటెడ్ మాయిశ్చరైజర్స్, బీబీ క్రీంస్, సీసీ క్రీంస్ స్కిన్ కి మంచి ఎక్స్ట్రా హైడ్రేషన్ ని ఇస్తాయి. అక్కడక్కడా ఒక పింపుల్ అలా మెరిసేటట్లు చేస్తాయి. బఫ్ఫింగ్ ఫౌండేషన్ బ్రష్ తో అప్లై చేస్తే ఎక్కువ కవర్ చేయవచ్చు. డ్యూయీ లుక్ కావాలంటే స్పాంజ్ వాడండి.
ఇక్కడ ఒక బ్లెమిష్, అక్కడ డార్క్ సర్కిల్స్... ఇలా కనిపించడం మీకు ఇష్టం లేకపోతే లైట్ వెయిట్, హైడ్రేటింగ్ కన్సీలర్ యూజ్ చేయండి. మీ ఫింగర్స్ తో బ్లెండ్ చేయండి. ప్రోడక్ట్ అలా మీ స్కిన్ మీద కరిగిపోతుంది.
క్రీమ్స్ చక్కగా బ్లెండ్ అయిపోతాయి. చాలా నాచురల్ గా కూడా కనిపిస్తాయి. మీ ఫౌండేషన్, కన్సీలర్ అప్లై చేశాక క్రీం బ్రాంజర్ ని తడి స్పాంజ్ తో బ్లెండ్ చేయండి. పౌడర్ బ్రాంజర్ తో సెట్ చేయండి. లేదా, ఈ లుక్ చాలా సేపు ఉండాలంటే సెట్టింగ్ స్ప్రే వాడండి.
మీ ఫేస్ నాచురల్ గానే గ్లోయీగా కనపడాలంటే హైలైటింగ్ కంపల్సరీ. అయితే, షిమ్మరీ హైలైటర్ బదులు క్లియర్ బేస్ ఉన్న క్రీం ఎంచుకోండి. ఇది ఒక నాచురల్ లుక్ ని ఇస్తుంది. పైగా ఇది కూడా క్రీం కాబట్టి మిగిలిన ప్రోడక్ట్స్ ఈజీగా బ్లెండ్ అయిపోతుంది.
బ్లష్..నాచురల్ బ్లష్ అద్భుతం గా ఉంటుంది. ఆ ఎఫెక్ట్ కోసం క్రీం బ్లష్ ని మీ చీక్స్, నుదురు, ముక్కు మీద అప్లై చేయండి.
మరీ ఐబ్రోస్ షేప్ చేయించుకున్న లుక్ ఈ నో మేకప్ మేకప్ లుక్ లో బావుండదు. మీ నాచురల్ ఐబ్రోస్ యొక్క బ్యూటీని బ్రో జెల్ తో కొద్దిగా పెంచండి. తరువాత వాటిని వాటి ప్లేస్ లోకి బ్రష్ చేయండి.
ఈ లుక్ లో స్కిన్ మీదే ఫోకస్ కాబట్టి మస్కారా వేయకపోయినా పరవాలేదు. కానీ మస్కారా వల్ల మీ కళ్ళు చురుకుగా చూస్తున్నట్టు ఉంటాయి. క్లియర్ మస్కారా ఎంచుకుంటే సరిపోతుంది.
లిప్‌స్టిక్, టింటెడ్ లిప్ బామ్, లిప్ బటర్... మార్కెట్ లో ఎన్నో ప్రోడక్ట్స్, ఎన్నో వెరైటీస్ లో ఉన్నాయి. మీకు సరిపోయే షేడ్ లో ఉన్న వాటిని ఎంచుకుంటే హ్యపీగా ఉంటుంది. అయితే, రెండు మూడు షేడ్స్ కలిపే పని ఈ లుక్ లో పెట్టుకోవద్దు. మీకు సరిపోయే షేడ్ లో ఉన్న ఒక ప్రోడక్ట్ ని ఎంచుకోండి, చాలు. మరి, ఈ లుక్ ని మీరూ ట్రై చేస్తారు కదా..





Untitled Document
Advertisements