వార్మప్ బాడీని ఫ్లెక్సిబుల్ గా తయారు చేస్తుందట...!

     Written by : smtv Desk | Tue, Jan 05, 2021, 02:29 PM

వార్మప్ బాడీని ఫ్లెక్సిబుల్ గా తయారు చేస్తుందట...!

ఫిట్నెస్ లో భాగంగా రకరకాల ఎక్సరసైజులు చేస్తుంటారు. కొంతమంది అలవోకగా అదో పెద్ద అని కాదన్నట్లుగా పుషప్స్ చేస్తుంటారు. అలాంటి వారిని చూస్తే లోపల్లోపల కొద్దిగా అసూయగా ఉంటుంది. అయితే, మీరు కూడా వారిలా తేలిగ్గా పుషప్స్ చేసేందుకు అడ్డు పడే కొన్ని ప్రాబ్లమ్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
పుషప్స్ కి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, బాడీ టోండ్ గా కనబడడం అందులో ఒకటి. మీరు రెగ్యులర్ గా పుషప్స్ చేస్తూ కూడా తేలికా గా చేయలేకపోతుంటే ఈ ప్రాబ్లమ్స్ మీకు అవరోధంగా నిలుస్తున్నాయేమో ఒకసారి పరిశీలించండి.
* వార్మప్ వల్ల టైట్ గా ఉన్న మజిల్స్ కొద్దిగా లూజ్ గా తయారవుతాయి, ఇందు వల్ల మీరు ఎక్సర్సైజెస్ ఈజీగా చేయగలరు. వార్మప్ బాడీని ఫ్లెక్సిబుల్ గా తయారు చేస్తుంది, చాలా కష్టమైన ఎక్సర్సైజులు కూడా తేలికగా చేయగలిగేలా మీ బాడీ తయారవుతుంది. వార్మప్ లేకుండా, స్టిఫ్ మజిల్స్ తో పుషప్స్ లాంటి విగరస్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీరు పడిపోయే అవకాశం ఉంది. పుషప్స్ చేయడానికి ముందు పది నుండి ఇరవై నిమిషాల వార్మప్ చేయండి.
* మీకు వీక్ మజిల్స్ ఉంటే మీకు ఉన్న మజిల్ మాస్ ని అది తీసేసుకుంటుంది, మీకు గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. మీ మజిల్స్ స్ట్రాంగ్ గా ఉండి, బాగా పెర్ఫార్మ్ చేయాలంటే ప్రోటీన్, ఫైబర్, గుడ్ ఫ్యాట్స్, ఇంకా ఇతర హెల్దీ న్యూట్రియెంట్స్ ని మీ ఆహారంలో భాగం చేసుకోండి.
* వెయిట్స్ లిఫ్ట్ చేయటం వలన మీ మజిల్స్ స్ట్రాంగ్, షార్ప్ గా అవుతాయి, మీ ఎండ్యూరెన్స్ బిల్డప్ అవుతుంది, మీరు బాగా పెర్ఫార్మ్ చేయగలుగుతారు. అంతే కాక, దెబ్బలు తగిలే రిస్క్ ని వెయిట్ లిఫ్ట్ తగ్గిస్తుంది. పార్క్ లో వాకింగ్ చేసినంత తేలికగా మీరు పుషప్స్ చేయాలంటే లెగ్స్, బ్యాక్, షోల్డర్స్ కి సంబంధించిన ఎక్సర్సైజెస్ మీరు చేయాలి.
* మీ మజిల్స్ అలిసిపోయి ఉంటే మీరు పుషప్స్ సరిగ్గా చేయలేరు. అందుకనే, వర్కౌట్స్ మధ్యలో బ్రేక్ తీసుకోకుండా ఉండడం మంచి పద్ధతి కాదు. మీరు వారమంతా చేసే వర్కౌట్స్ మధ్యలో ఒక రోజు రెస్ట్ తీసుకోవడం వల్ల ఇంకా ప్రొడక్టివ్ గా వ్యాయామం చేయగలుగుతారు.
* ఏ ఎక్సర్సైజ్ చేయటానికైనా సరైన పోశ్చర్ లో, సరైన మూమెంట్ తో చేయడం ఇంపార్టెంట్. మీరు ఎన్ని వెయిట్స్ లిఫ్ట్ చేసినా, ఎంత సమయం ఎక్సర్సైజులు చేసినా మీ టెక్నిక్ సరిగ్గా లేకపోతే మీ శ్రమ అంతా వృధా అయిపోతుంది. పుషప్స్ చేసేటప్పుడు మీ అరచేతులు భుజాల వెడల్పులో నేలని బలంగా ఆని ఉండాలి, మీ కోర్ స్ట్రాంగ్ గా ఉండాలి, మీ మిడ్‌సెక్షన్ స్ట్రైట్ గా ఉండాలి.
* ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చాలా మంది చేసే పొరపాట్లలో సరిగ్గా ఊపిరి తీసుకోకపోవడం కూడా ఒకటి. సరిగా శ్వాస తీసుకుంటే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు సరిగ్గా శ్వాస తీసుకోవడం వల్ల బాడీలో ఆక్సిజెన్ లెవెల్స్ పెరుగుతాయి, ఫలితంగా గుండె కొట్టుకునే వేగం పెరిగి ఎక్కువ క్యాలరీలు కరిగించడానికి వీలవుతుంది. మీ బ్లడ్ స్ట్రీమ్ లో ఎక్కువ ఆక్సిజెన్ ఉంటే మీరు బాగా పెర్ఫార్మ్ చేయగలుగుతారు.





Untitled Document
Advertisements