'గాజులు తొడక్కుని కూర్చోలేదు, ఎవ్వరికీ భయపడేది లేదు': బాలయ్య

     Written by : smtv Desk | Wed, Jan 06, 2021, 01:56 PM

'గాజులు తొడక్కుని కూర్చోలేదు, ఎవ్వరికీ భయపడేది లేదు': బాలయ్య

ఎమ్మెల్యే నందమూరి బాలయ్య హిందూపురంలో పర్యటిస్తున్నారు. తూముకుంట సరిహద్దు వద్ద టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరిన హిందూపురం మండలం జి. గుడ్డంపల్లి వద్ద కంది పంటను బాలయ్య పరిశీలించారు. బాలకృష్ణ కార్యక్రమానికి భారీగా టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. పంట నష్టపోయిన రైతుల్ని పరామర్శించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని విత్తనాలు ఇచ్చామని.. రైతులకు ప్రభుత్వం ఏం చేయడం లేదన్నారు బాలయ్య. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరి అధికారంలోకి వచ్చాక అరాచకాలు చేస్తున్నారని.. 8 లక్షల రేషన్ కార్డులు తొలగించాలి.. ఉచిత ఇసుక తొలగించారని.. ఇలా చాలా చేశారన్నారు.

ప్రత్యేక హోదా విషయంలో స్పందిస్తూ బాలయ్య తడబడ్డారు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక రాష్ట్రం అనేశారు. ప్రత్యేక రాష్ట్రం తీసుకొస్తామన్నారు.. ఇంతమంది ఎంపీలు ఉన్నారు ఏం సాధించారని అనేశారు. ఆ తర్వాత తెలుగు తమ్ముళ్లపై బాలయ్య ఫైరయ్యారు.. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పెద్ద నినాదాలు చేయడంతో వారిని వారించారు. ఏయ్.. ఉష్.. చుప్.. నోర్మూయ్ అంటూ హెచ్చరించారు.

సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలపై పోస్టులు పెట్టినందుకు కేసులు నమోదు చేయడంపై ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉంది ఏదైనా చెప్పుకోవచ్చని.. అలాగని కేసులు పెట్టి రెచ్చగొడితే ఊరుకోం.. గాజులు తొడక్కుని కూర్చోలేదన్నారు. ఎవరికీ భయపడేది లేదని.. వైఎస్సార్‌సీపీది రాక్షస పాలన అన్నారు. ప్రజలు ఎందుకు ఓటు వేశామని బాధపడుతున్నారని.. అలాంటప్పుడు ఎందుకు ఓటు వేయాలి అని ప్రశ్నించారు. ఒక్క ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి వారి కుటుంబ చరిత్ర తెలియదా.. గతంలో చేసిన పాలన తెలియదా అన్నారు. మంత్రి తమ్ముడు పేకాటలో పట్టుబడితే రూ.100 ఫైన్ కట్టి బయటకు వస్తానంటున్నారని ఇదే పద్దతని ప్రశ్నించారు.





Untitled Document
Advertisements