డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ మార్పు

     Written by : smtv Desk | Wed, Jan 06, 2021, 02:02 PM

డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ మార్పు

తెలంగాణ సర్కారు డ్రైవింగ్ లైసెన్స్ పొందే నిబంధనలను మార్చింది. ఇక నుంచి ఏమాత్రం చదువుకోకపోయినా డ్రైవింగ్ లైసెన్స్ పొందే సౌలభ్యం కలగనుంది. దీనివల్ల చదువుకోని చాలా మంది డ్రైవింగ్ లైసెన్స్ పొందే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్రం గతంలోనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

ఇక నుంచి 40 ఏళ్లు దాటిన వ్యక్తులు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలంటే కచ్చితంగా మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ కాలపరిమితి దాటిన తర్వాత దాన్ని రెన్యువల్ చేసుకోవడానికి నెల రోజులు గడువు ఇస్తారు. ఈలోగా మార్చుకోకపోతే రూ.1000 జరిమానా విధిస్తారు.

కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్, ఆర్.సి.బుక్, పర్మిట్ల చెల్లుబాటు కాలాన్ని 2021 మార్చి 31 వరకు రోడ్డు రవాణా ప్రధాన రహదారుల మంత్రిత్వశాఖ పొడిగించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఆ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది.





Untitled Document
Advertisements