పేలను చంపే మందుతో కరోనా హతం!

     Written by : smtv Desk | Wed, Jan 06, 2021, 02:08 PM

పేలను చంపే మందుతో కరోనా హతం!

తలలో పేలను చంపడానికి వాడే మందు 80 శాతం కరోనా మరణాలను అడ్డుకోగలుగుతుందట. కొవిడ్ మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం సైంటిస్టులు విస్తృతంగా పరిశోధనలు చేస్తున్న వేళ వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొవిడ్ బాధితుల ప్రాణాలను రక్షించడంతో పేల మందు (Ivermectin) అద్భుతంగా పనిచేస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. కరోనా బారినపడి హాస్పిటల్ పాలైన బాధితులను తిరిగి కోలుకునేలా చేయడంతో ఇది దోహదపడుతోందని రుజువైంది.

ఇది 80 శాతం కరోనా మరణాలను అడ్డుకోగలదంట. దీని ధర కూడా చాలా చౌకే కావడం మరో విశేషం. ఐవర్‌మెక్టిన్ డ్రగ్ తీసుకున్న 573 మంది కరోనా బాధితుల్లో 565 మంది కోలుకున్నారట. కేవలం 8 మంది మాత్రమే మరణించారు. ఇదే సమయంలో ప్లేసిబో డ్రగ్ తీసుకున్న 510 మందిలో 44 మంది మరణించారు.

లివర్‌పూల్ యూనివర్శిటీ వైరాలజిస్ట్ ఆండ్రూ హిల్ కొంత కాలంగా కరోనా వైరస్‌ను అడ్డుకునే చికిత్సా విధానం అభివృద్ధి చేయడానికి పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పేలను చంపే మందుపై ప్రయోగాలు చేశారు. ఈ కొత్త అధ్యయనానికి ట్రాన్స్‌ఫార్మేషనల్ (Transformational) అని పేరు పెట్టారు.

ఆండ్రూ హిల్ తన పరిశోధనలో భాగంగా 1,400 మంది కరోనా బాధితుల డేటా తీసుకున్నారు. ఆ వివరాల ఆధారంగా ఆయన పరిశోధనలు సాగించారు. ఇందుకు సంబంధించిన అధ్యయనాన్ని తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ అవుతోంది.

హానికారక పరాన్న జీవులను (Aantiparasitic) చంపే మందు.. 17 డాలర్ల నుంచి 43 డాలర్ల వరకు ఉంటుంది. ఇలాంటి డ్రగ్‌లతో పోలిస్తే.. పేలను చంపే మందు చాలా తక్కువ ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఇది ఒక సింగిల్ డోస్ తీసుకున్న 48 గంటల్లోనే అన్ని వైరల్ RNA లను తొలగించినట్టు అధ్యయనంలో రుజువైంది. ఇది సురక్షితమేనా, ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనేది తేలాల్సి ఉంది. ఈ అంశంపై మరిన్ని పరిశోధనలు కొనసాగుతున్నాయి.





Untitled Document
Advertisements