గురువారం గంగూలీ డిశ్చార్జ్

     Written by : smtv Desk | Wed, Jan 06, 2021, 02:54 PM

గురువారం గంగూలీ డిశ్చార్జ్

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ డిశ్చార్జ్ వాయిదాపడింది. గత శనివారం కోల్‌కతాలోని తన నివాసంలో వ్యాయామం చేస్తుండగా గంగూలీకి స్వల్ప గుండెపోటు వచ్చింది. దాంతో.. దాదాని హుటాహుటిన అతని కుటుంబ సభ్యులు కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్‌ ఆసుపత్రికి తరలించారు. గంగూలీ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు.. అతని గుండె రక్తనాళాల్లో మూడు చోట్ల పూడికట్లు ఉన్నట్లు తేల్చారు. ఆ వెంటనే యాంజియోప్లాస్టీ నిర్వహించి స్టంట్ వేశారు.

యాంజియోప్లాస్టీ తర్వాత సౌరవ్ గంగూలీ యాక్టీవ్‌గా ఉన్నాడని చెప్పుకొస్తున్న వుడ్‌ల్యాండ్స్ వైద్యులు.. మరో యాంజియోప్లాస్టీ నిర్వహించడంపై 9 మందితో కూడిన మెడికల్ బోర్డుని ఏర్పాటు గత సోమవారం ఏర్పాటు చేశారు. ఈ టీమ్.. గంగూలీ ఆరోగ్యంపై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి.. ఇప్పట్లో దాదాకి మరో యాంజియోప్లాస్టీ అవసరం లేదని తేల్చింది. దాంతో.. గంగూలీని బుధవారం డిశ్చార్జ్ చేయనున్నట్లు వుడ్‌ల్యాండ్ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. అయితే.. ఈరోజు విడుదల చేసిన బులిటెన్‌లో దాదా డిశ్చార్జ్‌ని వాయిదా వేసినట్లు ఆసుపత్రి పేర్కొంది.

‘‘సౌరవ్ గంగూలీని గురువారం డిశ్చార్జ్ చేయబోతున్నాం. మరో రోజు ఆసుపత్రిలో ఉంటానని దాదా ఈరోజు రిక్వెస్ చేశాడు. గంగూలీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. వైద్యులు ఎప్పటికప్పుడు అతని ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు’’ అని ఆసుపత్రి పేర్కొంది.





Untitled Document
Advertisements