క్యారెట్‌తో జ్యూస్‌తో క్యాన్సర్‌కు చెక్!!!

     Written by : smtv Desk | Wed, Jan 06, 2021, 05:00 PM

క్యారెట్‌తో జ్యూస్‌తో క్యాన్సర్‌కు చెక్!!!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వల్ల చనిపోతున్నవారి సంఖ్య మనకు తెలుస్తోంది. కానీ చాపకింద నీరులా జరుగుతున్న క్యాన్సర్ మరణాల గురించి మాత్రం మనకు తెలియడం లేదు. శరీరంలో ఊహించని విధంగా ఏర్పడే కొన్ని రకాల గడ్డలే రాచపుండులా మారతాయి. వాటి నుంచి బయటపడాలంటే.. తప్పకుండా ఆరోగ్య సూత్రాలు పాటించాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. క్యారెట్‌తో జ్యూస్‌తో క్యాన్సర్‌కు చెక్‌ పెట్టవచ్చట. ఇందుకు ఈ ఘటనే నిదర్శనం.
అన్నా కామెరాన్ అనే ఓ పుస్తక రచయిత్రికి 2012లో పెద్దపేగు క్యాన్సర్ సోకింది. అంతకంటే ముందు ఆమె భర్తకు కూడా క్యాన్సర్ సోకింది. దీంతో ఎన్నోరకాల చికిత్సలు అందించారు. చివరికి కీమోథెరపీ చేసినా ఆయన బతకలేదు. దీంతో ఆమె ఎలాంటి చికిత్స లేకుండా క్యాన్సర్ జయించాలని నిర్ణయించుకుంది. కిమో థెరఫీని నిరాకరించడం వల్ల ఆమె క్యాన్సర్ ఊపిరితీత్తులకు సైతం పాకింది. క్యాన్సర్ మరింత ముదిరి నాలుగో దశకు చేరింది. అయితే, అప్పటికీ ఆమె చికిత్సకు సిద్ధం కాలేదు. ఓ రోజు ఆమె రాల్ఫ్ కోర్ అనే చర్మ క్యాన్సర్ బాధితుడి బ్లాగ్ చూసింది. అందులో అతడు రోజుకు రెండున్నర లీటర్ల క్యారట్ జ్యూస్ తాగి చర్మ క్యాన్సర్ నుంచి బయపడ్డానని రాశాడు. అది అన్నాలో ధైర్యాన్ని నింపింది. అందులో పేర్కొన్నట్లే ఆమె కూడా రోజుకు రెండున్నర కిలోల క్యారెట్ జ్యూస్ తాగడం మొదలుపెట్టింది. చిత్రం ఏమిటంటే.. ఎనిమిది వారాల తర్వాత ఆమెలో ఉన్న క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు విస్తరించడం ఆగిపోయింది. క్యాన్సర్ కణుతులు సైతం క్షీణించాయి. నాలుగు నెలలు తర్వాత ట్యూమర్ సైతం తగ్గిపోయింది. ఎనిమిది నెలల తర్వాత సిటీ స్కాన్ చేయగా.. ఆమెలో క్యాన్సర్ లక్షణాలన్నీ మాయమయ్యాయి. ఈ సందర్భంగా అన్నా మాట్లాడుతూ.. ‘‘కీమో థెరపీ తీసుకుంటూ కూడా క్యారట్ జ్యూస్ తాగొచ్చు. కానీ, కీమో వల్ల కలిగే దుష్ప్రభావాల నుంచి తప్పించుకోడానికి క్యారట్ జ్యూస్‌ తీసుకోడానికే మొగ్గు చూపాను. క్యాన్సర్ నిర్ధరణ జరిగిన తర్వాత క్యారెట్ జ్యూస్ తాగి ఇతర భాగాలకు విస్తరించకుండా జాగ్రత్తపడవచ్చు’’ అని తెలిపింది.

తాజాగా ఉండే క్యారెట్ల పొట్టు తీయకుండా.. ఉప్పు కలిపిన వేడి నీటిలో వేసి శుభ్రం చేయండి. మీ బరువు 50 కేజీలు ఉంటే కేజీన్నర క్యారెట్లు సరిపోతాయి. క్యారెట్ ముక్కలను మిక్సీలో వేసి తిప్పండి. మరీ గట్టిగా ఉంటే కాస్త నీళ్లు పోయండి. పిప్పిని పిండేసి.. జ్యూస్ తాగేయండి. క్యాన్సర్ ఉన్నా, లేకున్నా క్యారట్ జ్యూస్ తాగడం ఎప్పుడూ ఆరోగ్యానికి మంచిదే. అయితే, తాజాగా ఉండే క్యారెట్‌లను మాత్రమే జ్యూస్ తయారీకి ఉపయోగించండి.

ఏ విధంగా పనిచేస్తుంది?:
✺ క్యారెట్‌‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్‌‌లు పుష్కలంగా ఉన్నాయి.
✺ క్యారెట్ రోజు తీసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది.
✺ క్యారెట్‌లోని ఫైబర్ పెద్ద ప్రేగులను క్లీన్ చేయడానికి ఉపయోగపడతాయి.
✺ క్యారెట్‌లో ఉండే ఫాల్కరినల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ క్యాన్సర్‌ పై పోరాడుతుంది.
✺ క్యారెట్‌ను జ్యూస్ రూపంలో రోజూ తీసుకుంటే లంగ్, లివర్, కోలన్ క్యాన్సర్లు దరిచేరవు.
✺ క్యారెట్‌లో ఉండే విటమిన్-A వల్ల కంటి చూపు మెరుగవుతుంది.
✺ క్యారెట్‌లోని సోడియం రక్తపోటును నియంత్రిస్తుంది.
✺ క్యారెట్‌‌ను రోజూ తీసుకుంటే బీపీ నియంత్రణలో ఉంటుంది.





Untitled Document
Advertisements