ఈ సమయంలో కలయిక జరిగితే ప్రెగ్నెన్సీ వస్తుందట

     Written by : smtv Desk | Wed, Jan 06, 2021, 05:04 PM

ఈ సమయంలో కలయిక జరిగితే ప్రెగ్నెన్సీ వస్తుందట

పెళ్లి అయినా తరువాత ప్రతి జంటకు ఎదురై ప్రశ్న ఏదైనా విశేషం ఉందా లేదా పిల్లలేప్పుడు అనేది. అయితే పిల్లల విషయంలో కొంచం గ్యాప్ తీసుకుందాం అనుకునే వాళ్ళ సంగతి పక్కన పెడితే, పిల్లల కోసం ఎదురుచూస్తున్న జంటలు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఓవులేషన్ గురించిన వివరాలు తెలిసి ఉంటే ఆ ప్రకారం ప్లాన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది.

ఓవరీస్ నుండి ఎగ్ రిలీజ్ అవ్వడాన్నే ఓవులేషన్ అంటారు. ఇది రిలీజ్ అయ్యే సమయం ప్రతి స్త్రీకీ మారుతుంది. మీ రెగ్యులర్ మెనుస్ట్రువల్ సైకిల్స్ లో ఓవులేషన్ కూడా ఒక భాగమే, ఇది కూడా నెల నెలా జరుగుతుంది. ఇది కరెక్ట్‌గా సైకిల్ మధ్యలో జరుగుతుంది, అంటే మీ లాస్ట్ పీరియడ్‌కి పద్నాలుగు రోజుల తరువాతా, తరువాత పీరియడ్ కి పధ్నాలుగు రోజుల ముందూ జరుగుతుంది. అయితే, ఇలా జరిగేది కేవలం మీది ఇరవై ఎనిమిది రోజుల సైకిల్ అయితే మాత్రమే. మిగిలిన సందర్భాల్లో ఐదారు రోజులు అటూ ఇటూగా జరగవచ్చు. ఈ సమయం లో మహిళ శరీరం లో ఎన్నో మార్పులు జరుగుతాయి. స్త్రీ ఫెర్టైల్ గా ఉండే సమయం ఇదే. ఈ టైమ్ లో కలిస్తే గర్భం ధరించే అవకాశం ఎక్కువ. డాక్టర్ల సూచన ప్రకారం ఓవులేషన్ కి ఐదు రోజుల ముందు కలిస్తే గర్భధారణకి చాలా ఎక్కువ అవకాశాలుంటాయని. ఇలా చెప్పడానికి గల కారణం ఏమిటంటే స్పెర్మ్ స్త్రీ శరీరంలో కొన్ని రోజులు ఉండగలదు, కాబట్టి ఎగ్ రిలీజ్ అయ్యే టైమ్ కి స్పెర్మ్ ఉంటే ఫెర్టిలైజైషన్ త్వరగా జరగవచ్చు. కానీ, ఓవులేషన్ జరిగే సమయం ఎలా తెలుస్తుంది? ఓవులేషన్ జరిగే ముందు స్త్రీ శరీరం లో కొన్ని సూచనలు కనబడతాయి, వాటిని గమనించుకుంటూ ఉంటే ఒక అంచనాకి రావడానికి వీలుగా ఉంటుంది.
గర్భధారణ జరగాలంటే శరీరం స్పెర్మ్ ని గర్భసంచి లోకి పుష్ చేయాలి. ఈ సమయం లో ఈస్ట్రోజెన్ స్థాయిలి అధికం గా ఉంటాయి, సెర్వికల్ మ్యూకస్ లేదా వైట్ డిస్చార్జ్ కొంచెం థిక్ గా ఉంటుంది. ఇది ఎగ్ వైట్ లా ఉంటుంది, స్పెర్మ్ ప్రయాణించడానికి వీలుగా ఉంటుంది. ఈ మ్యూకస్ ని చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. రెగ్యులర్ గా ఉండే సెర్వికల్ మ్యూకస్ కంటే ఇది తేడాగా ఉంటుంది.
అందరికీ ఇది జరుగుతుందని చెప్పలేం కానీ, కొంత మంది స్త్రీలు ఓవులేషన్ జరిగే సమయం లో పెయిన్ ని ఎక్స్పీరియెన్స్ చేస్తారు. ఓవరీ నుండి ఎగ్ రిలీజ్ అయినప్పుడు కొంత పెయిన్ ఉండవచ్చు. కొంత మందికి ఈ పెయిన్ అసలు తెలియకపోవచ్చు, కొంత మందికి లైట్ గా అనిపించవచ్చు, కొంత మంది కి తీవ్రం గా నొప్పి రావచ్చు.
ఓవులేషన్ జరిగే సమయం, ఆ సమయానికి అటూ ఇటూగా హార్మోన్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఈ సమయం లో బ్రెస్ట్, నిపిల్స్ కొంచెం సెన్సిటివ్ గా తయారవ్వచ్చు. ఓవులేషన్ ముందు నుండీ మొదలై ఆ తరువాత తగ్గిపోవచ్చు.
కొంత మంది స్త్రీలలో ఓవులేషన్ సమయం లో స్పాటింగ్ ఉండవచ్చు. సైకిల్ మొదటి ఫేజ్ లో ఈస్ట్రోజెన్ లెవెల్స్ పెరిగి యుటెరస్ లోపలి లైనింగ్ ని పెంచుతాయి. ఓవులేషన్ అయిపోయిన తరువాత ప్రొజెస్టిరాన్ ఈ లైనింగ్ ని మందంగా చేస్తుంది. మామూలుగా ఇలానే జరుగుతుంది. ఈస్ట్రోజెన్ వల్ల యుటెరైన్ లైనింగ్ డెవలప్ అయ్యి ప్రొజెస్టిరాన్ వల్ల థిక్ గా అవ్వకపోతే స్పాటింగ్ కనపడుతుంది.
ఓవులేషన్ జరిగే సమయం లో ఉండే హై ఈస్ట్రోజెన్ లెవెల్స్ వల్ల సెక్స్ మీద ఇంటరెస్ట్ బాగా పెరుగుతుంది. అయితే, సెక్స్ మీద ఇంటరెస్ట్ ఓవులేషన్ వల్లే కలగదు. అలాగే, మీకు సెక్స్ మీద ఇంటరెస్ట్ కలగకపోతే ఓవులేషన్ జరగలేదని అర్ధం కాదు.
ఓవులేషన్ జరిగే సమయం లో సెర్విక్స్ కొద్దిగా సాఫ్ట్ గా ఔవుతుని, అప్పుడె స్పెర్మ్ ప్రయాణించగలదు. ఓవులేషన్ మొదలయిపోయాక మళ్ళీ నార్మల్ గా అయిపోతుంది, బాడీని ప్రెగ్నెన్సీకి అనువుగా తయారు చేస్తుంది.
ప్రతి రోజూ పక్క మీద నుండి లేవకుండా టెంపరేచర్ చెక్ చేసుకుంటే ఓవులేషన్ జరిగే సమయం తెలిసిపోతుంది. ఈ టెంపరేచర్ ని రోజులో ఇతర సమయాల్లో ఉన్న టెంపరేచర్ తో చెక్ చేసుకోవాలి. ఓవులేషన్ జరిగే సమయం లో ఈ టెంపరేచర్ ఎక్కువ అవుతుంది. అయితే, ఈ టెంపరేచర్ చెక్ చేసుకోవలసినది రోజూ పొద్దున్న ఒకే సమయం లో ఇంకా బాత్రూం కి కూడా వెళ్ళక ముందే చెక్ చేసుకోవాలి.





Untitled Document
Advertisements