పీనట్స్ తో చిన్న పిల్లలకి ప్రమాదం తెలుసా?!

     Written by : smtv Desk | Wed, Jan 06, 2021, 07:14 PM

పీనట్స్ తో చిన్న పిల్లలకి ప్రమాదం తెలుసా?!

చిన్నపిల్లల దగ్గరనుండి పెద్దవాళ్ళ వరకు ప్రతిఒక్కరు పల్లీలు ఎంతో ఇష్టంగా తింటారు. పల్లీ చట్నీ దగ్గర నుండి పీనట్ బటర్ వరకూ మనం వేరు శనగలని వివిధ రూపాల్లో తీసుకుంటాం. ఇండియా లోపల్లీలు డబ్బాలో లేని వంటిల్లు ఉండదు అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. పైగా వీటి ద్వారా లభించే హెల్త్ బెనిఫిట్స్ కూడా తక్కువేమీ కాదు. అయితే, ఈ రుచినీ, వీటి ఆరోగ్య ప్రయోజనాలనీ కొంతమంది పొందడం లేదు. దానికి కారణం వారికి కల పీనట్ ఎలర్జీ. ఈ ఎలర్జీ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది చిన్న పిల్లల్లో కనిపిస్తుంది. పైగా, ఈ ఎలర్జీ బారిన పడుతున్న పిల్లల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని రీసెంట్‌గా జరిగిన స్టడీస్ ప్రూవ్ చేస్తున్నాయి. ఈ విషయంలో డాక్టర్ని కన్సల్ట్ చేయడం ఎప్పుడూ మంచి పద్ధతే, అయితే ఒక స్టడీ ప్రకారం చిన్న పిల్లల్లో, అంటే, ఇంకా స్కూల్ కి కూడా వెళ్ళని పిల్లలకి రెగ్యులర్ గా పీనట్స్ ఇస్తే వారికీ ఎలర్జిక్ రియాక్షన్ వచ్చే రిస్క్ ని రెడ్యూస్ చేయవచ్చని తెలుస్తోంది. ఈ ట్రీట్మెంట్ పద్ధతిని ఓరల్ ఇమ్యూనో థెరపీ అంటారు.

ఈ స్టడీలో 117 ప్రీ స్కూలర్స్ పాల్గొన్నారు. వీరిలో తొమ్మిది నెలల నుండి ఐదేళ్ళ వారి వరకూ ఉన్నారు. వీరికి రెగ్యులర్‌గా 300 మిల్లీ గ్రాముల పీనట్ ప్రోటీన్ ఇచ్చారు. అంటే, సుమారుగా ఒక వేరు శనగగుండు, పావు టీ స్పూన్ పీనట్ బటర్ అని అర్ధం చేసుకోవచ్చు. ఒక సంవత్సరం తర్వాత సుమారుగా అందరూ పిల్లలు మూడు నాలుగు వేరు శనగగుళ్ళు ఎలాంటి ఎలర్జిక్ రియాక్షన్ లేకుండా తినగలరని తెలిసింది. ఈ పిల్లల్లో ఎనభై శాతం మంది సుమారు పదిహేను వేరుశనగ గుళ్ళ వరకూ కూడా తినగలరని తెలిసింది. నిపుణులు చెప్పినదాని ప్రకారం మూడు నాలుగు పీనట్స్‌కి రెసిస్టెన్స్ ఉంటే తొంభై తొమ్మిది శాతం యాక్సిడెంటల్ ఎక్స్పోజర్ నుండి ప్రొటెక్ట్ అవ్వచ్చు. అయితే, కొంత మంది మాత్రం ఈ కోర్స్ లో కొన్ని ఎలర్జిక్ రియాక్షన్స్ ఎక్స్పీరియెన్స్ చేశారు, అయితే అవి మైల్డ్ నుండి మోడరేట్ రియాక్షన్స్ మాత్రమే అనీ, ఎలాంటి సివియారిటీ లేదనీ తెలిసింది.


ఈ ఎలర్జిక్ రియాక్షన్స్ వల్ల రియల్ ట్రబుల్స్ ఫేస్ చేస్తున్న పిల్లలకీ వారి కుటుంబాలకీ ఈ పరిశోధన ఒక ఆశాకిరణంలా కనబడుతోంది. ఈ ఓరల్ ఇమ్యూనో థెరపీ వల్ల పిల్లలు తెలియక పీనట్ బటర్ ఉన్న కుకీనో, కేక్ వంటిదో తిన్నా రియాక్షన్ ఉండకుండా ఉంటుంది. ఇది డెఫినెట్ గా ఫ్యామిలీస్ కి మంచి వార్తే అని ఆ పరిశోధకులు అంటున్నారు.





Untitled Document
Advertisements