ఆకాశాన్ని తాకిన పెట్రోల్ ధరలు...డీజిల్ ధరదీ ఇదే దారి

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 02:28 PM

ఆకాశాన్ని తాకిన పెట్రోల్ ధరలు...డీజిల్ ధరదీ ఇదే దారి

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. డీజిల్ ధరలు పెరిగిపోవడంతో ట్రాన్స్‌ఫోర్ట్ కూడా భారం అవుతోంది. దీంతో అంతిమంగా ఈ ప్రభావం ప్రజలపైనే పడుతోంది. అయితే వాహనదారులక, ఇతరులకు ఊరట కలిగే నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉంది.

దేశీ ఇంధన ధరలు రికార్డ్ స్థాయికి చేరిన నేపథ్యంలో పెట్రోలియం మంత్రిత్వ శాఖ వాహనదారులకు ఊరట కలిగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వానికి ధరల తగ్గింపు ప్రతిపాదన చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. వెలువడుతున్న నివేదికల ప్రకారం.. కరోనా వైరస్ సమయంలో కేంద్రం పెంచిన ఎక్సైజ్ డ్యూటీలో 50 శాతం తగ్గింపు అందించినా కూడా ధరలు లీటరుకు రూ.5 వరకు తగ్గొచ్చు.

కాగా కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ సమయంలో పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని రూ.10 వరకు పెంచిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సుంకాన్ని తగ్గించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి అనుగుణంగా రేట్లు తగ్గిస్తే.. అప్పుడు వినియోగదారులకు పూర్తి ప్రయోజనం కలుగుతుంది.

ఇకపోతే దేశీ ఇంధన ధరల పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి. రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు నిలకడగానే కొనసాగాయి. దీంతో హైదరాబాద్ శుక్రవారం పెట్రోల్ ధర రూ.87.59 వద్దనే స్థిరంగానే కొనసాగుతోంది. అదేసమయంలో డీజిల్ ధర రూ.81.17 వద్ద నిలకడగా ఉంది.





Untitled Document
Advertisements