ఆస్ట్రేలియా 338కి ఆలౌట్

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 02:36 PM

ఆస్ట్రేలియా 338కి ఆలౌట్

సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియాని తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకి శుక్రవారం భారత్ ఆలౌట్ చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 166/2‌తో ఈరోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టులో స్టీవ్‌స్మిత్ (131: 226 బంతుల్లో 16x4) సెంచరీ బాదగా.. లబుషేన్ (91: 196 బంతుల్లో 11x4) కొద్దిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు పడగొట్టగా.. జస్‌ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీ చెరో రెండు, మహ్మద్ సిరాజ్‌కి ఒక వికెట్ దక్కింది. స్టీవ్‌స్మిత్‌ని చివర్లో రవీంద్ర జడేజా రనౌట్ చేశాడు.

శుక్రవారం మార్కస్ లబుషేన్ 67, స్టీవ్‌స్మిత్ 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్యాటింగ్‌ని కొనసాగించారు. ఈ క్రమంలో సెంచరీ సాధించేలా కనిపించిన లబుషేన్ స్పిన్నర్ రవీంద్ర జడేజా మాయాజాలానికి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన మాథ్యూవెడ్ (13), కామెరూన్ గ్రీన్ (0), టిమ్ పైనీ (1), పాట్ కమిన్స్ (1), పాట్ కమిన్స్ (0) వరుసగా నిరాశపరిచారు. కానీ.. ఆఖర్లో మిచెల్ స్టార్క్ (24: 30 బంతుల్లో 2x4, 1x6) మంచి సపోర్ట్‌ని స్టీవ్‌స్మిత్‌కి అందించాడు. దాంతో.. టెస్టు కెరీర్‌లో 27వ సెంచరీ నమోదు చేసిన స్టీవ్‌స్మిత్.. శతకం తర్వాత దూకుడుగా ఆడేశాడు. అయితే.. ఆఖర్లో లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ రనౌటయ్యాడు. దాంతో.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌కి తెరపడింది. భారత్‌పై స్మిత్‌కి ఇది 8వ సెంచరీ.





Untitled Document
Advertisements