క్యాపిటల్ బిల్డింగ్‌పై ట్రంప్ మద్దతుదారుల దాడి...చైనా సెటెర్లు

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 02:58 PM

క్యాపిటల్ బిల్డింగ్‌పై ట్రంప్ మద్దతుదారుల దాడి...చైనా సెటెర్లు

అమెరికాపై కసి తీర్చుకోడానికి గోతికాడ నక్కలా ఎదురుచూస్తున్న చైనాకు క్యాపిటల్ బిల్డింగ్‌పై ట్రంప్ మద్దతుదారుల దాడి రూపంలో ఆ అవకాశం రానేవచ్చింది. ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్న శత్రువుకి అవకాశం వస్తే వదులుకుంటుందా? మరి చైనా కూడా అలాగే స్పందించింది. క్యాపిటల్ బిల్డింగ్‌లోని దృశ్యాలకు చైనా సోషల్ మీడియాలో నెటిజన్లు వెల్లువెత్తాయి. ఇది‘అద్భుత దృశ్యం’ అనే కామెంట్ వైరల్ అవుతోంది. అమెరికా క్యాపిటల్ బిల్డింగ్ దృశ్యాలను ఒకప్పుడు హాంగ్‌కాంగ్‌లో జరిగిన నిరసనలతో పోల్చుతూ సెటెర్లు వేస్తున్నారు.

చైనా మీడియా సైతం హాంగ్‌కాంగ్‌లో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, ఆందోళనలను ప్రస్తావించింది. ఆ ఆందోళనలను నేటి అమెరికా సంఘట దృశ్యాలతో కలిపి ఓ ఫోటోను అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘అమెరికా దిగువ సభ స్పీకర్ నాన్సీ పెలోసీ జూన్ 2019 నాటి హాంగ్‌కాంగ్ నిరసనలను అద్భుత దృశ్యం అని కొనియాడారు.. మరి క్యాపిటల్ బిల్డింగ్‌లోని నేటి దృశ్యాలపై ఆమె ఏ వ్యాఖ్య చేస్తారో’ అంటూ వ్యంగ్యాస్త్రం సంధించింది.

చైనా కమ్యూనిస్టు పార్టీ యూత్ లీగ్ కూడా నాన్సీ పెలోసీ వ్యాఖ్యలను గుర్తు చేసుకుంది. సుందర దృశ్యం పేరిట చైనా యువత సోషల్ మీడియాలో అమెరికాకు వ్యతిరేకంగా కామెంట్లు వెల్లువలా పెడుతున్నారు. క్యాపిటల్ బిల్డింగ్‌పై ట్రంప్ మద్దతుదారుల దాడి పేరుతో ఉన్న హ్యష్ ట్యాగ్ చైనా సోషల్ మీడియా వియబోలో వైరల్ అవుతోంది. నాడు హాంగ్‌‌కాంగ్ నిరసనకారులకు మద్దతు తెలిపిన ఐరోపా దేశాల ద్వంద్వ వైఖరి బట్టబయలైందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు దీనిపై 5వేలకుపైగా లైక్స్ వచ్చాయి.

‘కొన్ని మీడియా సంస్థలతో సహా యూఎస్‌లోని కొంతమంది వ్యక్తుల స్పందన పూర్తిగా భిన్నంగా ఉంటుంది’ అని చైనా విదేశాంగ శాఖ మనోభావాలను వ్యక్తం చేసింది. గురువారం విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చునైంగ్ మాట్లాడుతూ... ‘తీక్షణమైన చర్యలతో ఒక ఆలోచన చేస్తుంది.. తీవ్రమైన, లోతైన ప్రతిచర్యకు ఇది నిదర్శనం’ అని వ్యాఖ్యానించారు. ‘ఈ సమయంలో హాంకాంగ్, తైవాన్ మీడియా ద్వంద వైఖరితో ఎటువంటి కథనాలు ప్రచారం చేస్తున్నాయో తెలియదు’చునైంగ్ అన్నారు.





Untitled Document
Advertisements