జో బైడెన్-కమలా హ్యారిస్ విజయాన్ని ఎలక్ట్రోరల్ కాలేజ్ ధ్రువీకరిస్తూ నిర్ణయం

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 03:00 PM

జో బైడెన్-కమలా హ్యారిస్ విజయాన్ని ఎలక్ట్రోరల్ కాలేజ్ ధ్రువీకరిస్తూ నిర్ణయం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థి గెలుపును ధ్రువీకరించే కార్యక్రమంలో అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా అమెరికా కాంగ్రెస్ సమావేశం కాగా.. ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంలోకి దూసుకొచ్చిన బీభత్సం సృష్టించారు. దీంతో ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిలిపివేసి, బ్యాలెట్ బాక్సులను దాచిపెట్టారు. నాలుగు గంటల పాటు ఆందోళనకారులు అక్కడ నుంచి కదలకపోవడంతో జాతీయ సెక్యూర్టీ గార్డ్స్ రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం తిరిగి ప్రక్రియను ప్రారంభించారు.

గతేడాది నవంబరు 3న జరిగిన ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించగా.. ఆయన గెలుపును అమెరికా కాంగ్రెస్ తాజాగా ధ్రువీకరించింది. దీంతో అమెరికా 46వ అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నికయ్యారు. వైస్-ప్రెసిడెంట్‌గా భారత సంతతి మహిళ కమలా హ్యారిస్‌ను కాంగ్రెస్ ఖరారు చేసింది. జో బైడెన్-కమలా హ్యారిస్ విజయాన్ని ఎలక్ట్రోరల్ కాలేజ్ ధ్రువీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం 538 ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్లకుగానూ బైడెన్‌కు 306 ఓట్లు, డొనాల్డ్ ట్రంప్‌కి 232 ఓట్లు దక్కాయి. రిపబ్లికన్‌లకు కంచుకోట లాంటి జార్జియా వంటి రాష్ట్రాల్లో డెమొక్రాట్ల జెండా ఎగిరింది.

కాగా, అధ్యక్షుడు ట్రంప్ చర్యలతోనే ఆయన మద్దతుదారులు హింసకు పాల్పడ్డారని భావిస్తున్నారు. నాలుగు గంటల హింసాత్మక ఘటనల తర్వాత యూఎస్‌ కాంగ్రెస్‌ సమావేశం మళ్లీ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష పీఠం నుంచి అభిశంసన ద్వారా తొలగించే అంశంపై క్యాబినెట్ భేటీలో చర్చించినట్టు అమెరికా మీడియా పేర్కొంది.





Untitled Document
Advertisements