పిన్ నంబర్‌ తో దొరికిన ఏటీఎం కార్డు...బ్యాలెన్స్ చెక్ చేస్తే షాక్!!!

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 03:56 PM

పిన్ నంబర్‌ తో దొరికిన ఏటీఎం కార్డు...బ్యాలెన్స్ చెక్ చేస్తే షాక్!!!

విశాఖలో ఓ యువకుడికి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. రోడ్డుపై దొరికిన ఏటీఎం కార్డు దొరికింది.. పిన్ నంబర్ ఉండటంతో బ్యాలెన్స్ చెక్ చేయడంతో మతిపోయింది. తనది కాని డబ్బు వద్దనుకుని తీసుకెళ్లి పోలీసుల్ని సంప్రదించి.. ఆ కార్డును పోగొట్టుకున్న వ్యక్తికి అప్పగించాడు. విశాఖలోని కంచరపాలెంకు చెందిన ప్రీతం ప్రతి రోజులాగే రాత్రి తన పని ముగించుకుని ఇంటికెళుతున్నాడు. దారి మధ్యలో ఓ బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర ఓ ఏటీఎం కార్డు దొరికింది. వెంటనే ఏటీఎంను తీసుకుని చెక్ చేశాడు.. దానిపై పిన్ నెంబరు కూడా ఉండటంతో అవాక్కయ్యాడు.

ఎవరో కార్డును పోగొట్టుకున్నారని భావించాడు.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలనుకున్నాడు. కానీ పిన్ నెంబర్ ఉండడంతో అందులో అసలు ఎంత డబ్బు ఎంత ఉందో చూద్దామని ఏటీఎంలో చెక్ చేశాడు. అందులో బ్యాలెన్స్ చూసి దిమ్మ తిరిగిపోయింది.. ఏకంగా రూ.18 లక్షల బ్యాలెన్స్ ఉంది. భారీగా డబ్బులు ఉండటంతో కార్డు తిరిగి బాధితుడికి అప్పగిద్దామనుకున్నాడు.. రాత్రి కావడంతో ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే కంచరపాలెం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పాడు.

అక్కడ ఎస్సై వెంటనే ఓ కానిస్టేబుల్‌తో పాటు ప్రీతంను పంపించి బ్యాంకులో ఆ ఏటీఎం ఎవరి పేరుపై ఉందో సమాచారం సేకరించారు. దర్యాప్తులో ఆ ఏటీఎం కార్డు కంచరపాలెం పరిధిలో సుభాష్ నగర్‌లో నివసిస్తున్న ఆనంద్ ఉదయ్ అనే వ్యక్తికి చెందినదిగా చెందినదిగా తేలింది. బ్యాంక్ సిబ్బంది నుంచి ఆనంద్ మొబైల్ నెంబర్ తీసుకుని కాల్ చేశారు. అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వచ్చింది. తర్వాత కానిస్టేబుల్‌ను అతడి ఇంటికి పంపించారు. ఆ కానిస్టేబుల్ ఆనంద్‌ను వెంటబెట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు.
కార్డు పోగొట్టుకున్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన భార్య ఇటీవలే మరణించిందని.. ఆమె పేరుపై రూ.18 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినట్లు ఆనంద ఉదయ్ పోలీసులకు చెప్పాడు. తర్వాత ప్రీతం సమక్షంలోనే ఎస్సై ఆ కార్డును అతడికి అప్పగించారు. ప్రీతం నిజాయితీని పోలీసులు ప్రశంసించారు. అతడి నిజాయితీని మెచ్చుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ప్రీతంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.





Untitled Document
Advertisements