జనవరి 18న కొత్త హానర్ వీ40 5జీ స్మార్ట్ ఫోన్

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 05:11 PM

జనవరి 18న కొత్త హానర్  వీ40 5జీ స్మార్ట్ ఫోన్

హానర్ వీ40 స్మార్ట్ ఫోన్ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఫోన్‌ను జనవరి 18వ తేదీన లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ ఫోన్ మొదట చైనాలో లాంచ్ కానుంది. మిగతా దేశాల్లో లాంచ్ చేస్తుందా లేదా అనే విషయాన్ని హానర్ ఇంకా వెల్లడించలేదు.

హానర్ ఈ విషయాన్ని తన అధికారిక వీబో హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. దీనికి సంబంధించిన టీజర్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది. దీని బట్టి ఈ ఫోన్ కర్వ్‌డ్ డిస్ ప్లేతో రానుంది. ఇందులో డ్యుయల్ పంచ్ హోల్ కెమెరాలు ఉండనున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు ఇప్పటికే ఆన్ లైన్‌లో లీకయ్యాయి. అయితే ఈ లీకులు నిజమో కాదో తెలియాలంటే మాత్రం జనవరి 18వ తేదీ వరకు ఆగాల్సిందే.
ఇందులో 6.72 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లేను అందించనున్నారు. ఈ డిస్ ప్లే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 300 హెర్ట్జ్‌గానూ ఉండే అవకాశం ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్‌పై హానర్ వీ40 పనిచేయనుంది. ఇందులో 5జీ ఫీచర్‌ను కూడా అందించనున్నారు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత మ్యాజిక్ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే అవకాశం ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ లేదా 50 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌లు ఇందులో ఉండనున్నాయి. ఇక ముందువైపు రెండు సెల్పీ కెమెరాలు అందించనున్నారు. 32 మెగాపిక్సెల్, 16 మెగాపిక్సెల్ సెన్సార్లు ఇందులో ఉండనున్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 66W ఫాస్ట్ చార్జింగ్, 45W వైర్ లెస్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. యూఎస్‌బీ టైప్-సీ పోర్టును ఇందులో అందించనున్నట్లు సమాచారం.

అయితే మరో లీక్ ప్రకారం ఈ ఫోన్ 50W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఈ రెండిట్లో ఏది నిజమో తెలియాలంటే లాంచ్ వరకు తెలియాల్సిందే. అంతేకాకుండా దీని ధర గురించిన వివరాలు కూడా తెలియరాలేదు.





Untitled Document
Advertisements