భారీగా తగ్గిన బంగారం...పసిడి ప్రేమికులకు శుభవార్త

     Written by : smtv Desk | Sat, Jan 09, 2021, 11:39 AM

భారీగా తగ్గిన బంగారం...పసిడి ప్రేమికులకు శుభవార్త

బంగార ధర భారీగా పతనమైంది. వెలవెలబోయింది. పసిడి పడిపోయింది. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి ధర కూడా రూ.వేలల్లో దిగొచ్చింది. పసిడి ప్రేమికులకు ఇది అదిరిపోయే శుభవార్త అని చెప్పొచ్చు. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు పడిపోవడం ఇందుకు కారణం.

ఎంసీఎక్స్ మార్కెట్‌లో శుక్రవారం ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఏకంగా 4 శాతం పతనమైంది. రూ.2,050 తగ్గుదలతో 10 గ్రాముల బంగారం ధర రూ.48,818కు క్షీణించింది. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి ధర కేజీకి రూ.6,100 తగ్గుదలతో రూ.63,850 తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర భారీగా దిగిరావడం ఇందుకు ప్రధాన కారణం. గ్లోబల్ మార్కెట్‌లో పసిడి 4 శాతం పడిపోయింది. ఔన్స్ బంగారం ధర మళ్లీ 1900 డాలర్ల కిందకు వచ్చేసింది. 1833 డాలర్లకు క్షీణించింది. దీంతో దేశీ మార్కెట్‌లో కూడా బంగారం ధర కుప్పకూలింది.

అగ్రరాజ్యం అమెరికా భారీ ఉద్దీపణ ప్యాకేజీ ప్రకటించొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. దీంతో పదేళ్ల బాండ్ ఈల్డ్ పైకి కదిలింది. మార్చి నాటి గరిష్ట స్థాయికి ఎగసింది. దీంతో బంగారం ధర భారీగా పడిపోయింది. పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు.





Untitled Document
Advertisements