వికారాబాద్‌లో కళ్లు తిరిగి కిందపడిపోతున్న జనం

     Written by : smtv Desk | Sat, Jan 09, 2021, 11:55 AM

వికారాబాద్‌లో కళ్లు తిరిగి కిందపడిపోతున్న జనం

తెలంగాణలో కరోనా వైరస్‌కు తోడు కొత్త వ్యాధి కలకలం రేపుతోంది. వింత వ్యాధితో జనం ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్ మండలాల్లో వింత వ్యాధి కలకలం రేపుతోంది. ఒక్కసారిగా కళ్లు తిరిగి వాంతులు, విరేచనాలతో ప్రజలు కింద పడిపోతున్నారు. పలు గ్రామాల్లో పదుల సంఖ్యలోఈ వింత రోగం వెలుగు చూసింది. దీంతో అనేక మంది ఆస్పత్రి పాలవుతున్నారు. అసలు తమకు ఏమైందో తెలియక ఆందోళన చెందుతున్నారు. రోగం తెలియక భయపడుతున్నారు. కళ్లలో మంటలు వాంతులు విరోచనాలు ప్రజలు అయోమయంకు గురవుతున్నారు.


కొంతమందికి కింద పడి పోవడంతో గాయాలు అయినట్టుగా స్థానికులు చెబుతన్నారు. ఇప్పటికే సంఘటన స్థలానికి చేరుకున్న వైద్యాధికారులు రెవెన్యూ సిబ్బంది.. ఘటనపై విచారణ చేపట్టారు. ఎందుకిలా ప్రజల అనారోగ్యం పాలవుతున్న దానిపై ఆరా తీస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న నీరు, ఆహారం అలవాట్లపై ఆరా తీస్తున్నారు. ఇలాంటి అంతుచిక్కని వ్యాధి ఇప్పటికే ములుగు జిల్లాలో కలకలం రేపిన విషయం తెలిసిందే. జిల్లాలోని కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి ఎస్సీ కాలనీలో వింత రోగం వ్యాపించింది. మొదటి రోజు జ్వరం ఆ తరువాత రెండు రోజుల్లో కడుపు ఉబ్బి చనిపోతున్నట్లు కాలనీ వాసులు తెలిపారు.





Untitled Document
Advertisements