LIC పాలసీ: ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.4 వేలు

     Written by : smtv Desk | Sat, Jan 09, 2021, 12:03 PM

LIC పాలసీ: ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.4 వేలు

దేశీ అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ LIC కస్టమర్లకు ఎన్నో రకాల సేవలు అందిస్తోంది. పలు రకాల పాలసీలు ఆఫర్ చేస్తోంది. వీటిని తీసుకోవడం వల్ల రాబడితోపాటు కుటుంబ ఆర్థిక భద్రత కూడా లభిస్తుంది. అయితే మీరు మీ అవసరాలకు అనుగుణమైన పాలసీ తీసుకోవాలి.

ఎల్‌ఐసీ అందిస్తున్న పాలసీల్లో జీవన్ అక్షయ పాలసీ కూడా ఒకటి. ఇది యాన్యుటీ ప్లాన్. ఈ పాలసీ తీసుకోవడం వల్ల ప్రతి నెలా పెన్షన్ పొందొచ్చు. మీరు ఎంత మొత్తానికి పాలసీ తీసుకుంటారనే అంశం ప్రాతిపదికన మీకు వచ్చే పెన్షన్ కూడా ఆధారపడి ఉంటుంది.

కనీసం రూ.లక్ష బీమా మొత్తానికి పాలసీ తీసుకోవలసి ఉంటుంది. పెన్షన్ డబ్బులను ప్రతి నెలా లేదంటే మూడు నెలలకు ఒకసారి తీసుకోవచ్చు. ఇది కూడా కాకపోతే ఆరు నెలలు, ఏడాదికి ఒకసారి కూడా పెన్షన్ పొందే అవకాశముంది. 30 నుంచి 85 ఏళ్ల మధ్యలో వయసు కలిగిన వారు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హలు.

ఈ పాలసీ తీసుకోవడం వల్ల పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందొచ్చు. అలాగే లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. మీకు పది రకాల పెన్షన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఈ పాలసీ ద్వారా మీరు నెలకు రూ.4 వేలు ఎలా పొందొచ్చొ తెలుసుకుందాం.

30 ఏళ్ల వయసులో ఉన్న మీరు రూ.9 లక్షల మొత్తానికి ఎల్‌ఐసీ జీవన్ అక్షయ పాలసీ తీసుకున్నారని అనుకుందాం. లైఫ్ టైమ్ ఆప్షన్ ఎంచుకుంటే ఇప్పుడు మీకు సంవత్సరానికి రూ.51,525 పెన్షన్ వస్తుంది. ఆరు నెలలకు అయితే రూ.25,358 పెన్షన్ లభిస్తుంది. మూడు నెలలకు అయితే రూ.12,578 పెన్షన్ పొందొచ్చు. అదే మీరు ప్రతి నెలా పెన్షన్ పొందాలని భావిస్తే రూ.4166 వస్తాయి.





Untitled Document
Advertisements