బంగారం కొనే వారికి శుభవార్త…డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన పని లేదు

     Written by : smtv Desk | Sat, Jan 09, 2021, 12:36 PM

బంగారం కొనే వారికి శుభవార్త…డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన పని లేదు

బంగారం కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. బంగారం కొనుగోలు చేసే వారు కేవైసీ డాక్యుమెంట్లు అందించాల్సి ఉంటుందని నివేదికలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు ఈ అంశంపై క్లారిటీ వచ్చింది. దీంతో బంగారు ఆభరణాలు కొనే వారికి ఊరట కలుగనుంది.

బంగారం, వెండి, ఇతర విలువైన రత్నాలను కొనుగోలు చేయాలని భావించే వారు నగదు రూపంలో డబ్బులు చెల్లిస్తే నో యువర్ కస్టమర్ KYC అందించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. క్యాష్ ట్రాన్సాక్షన్లకు సంబంధించి ఎలాంటి నిబంధనను అమలు చేయలేదని పేర్కొన్నాయి.
అధిక విలువ కలిగిన నగదు లావాదేవీలకు మాత్రమే పాన్ కార్డు, ఆధార్ కార్డు వంటివి అవసరం అవుతాయి. అంటే రూ.2 లక్షలకు పైన క్యాష్ లావాదేవీలకు కేవైసీ డాక్యుమెంట్లు చూపించాల్సి ఉంటుంది. ఈ రూల్స్ గతంలో నుంచే అమలులో ఉంది. ఇది అలాగే కొనసాగుతుంది.

అవినీతి నిరోధక చట్టం 2002 ప్రకారం.. రూ.10 లక్షలు లేదా ఆపైన విలువైన బంగారు ఆభరణాలు, వెండి, ఇతరత్రా వాటి కొనుగోలుకు ఎలాంటి లావాదేవీలు నిర్వహించినా కూడా కచ్చితంగా కేవైసీ డాక్యుమెంట్లు అందించాలి. అందువల్ల రూ.2 లక్షలకు లోపు బంగారం కొనే వారు కేవైసీ డాక్యుమెంట్లు అందించాల్సిన అవసరం లేదు.





Untitled Document
Advertisements