కేంద్రం నుంచి పీఎం కిసాన్ స్కీమ్...రైతుల అకౌంట్లలోకి రూ.6 వేలు!

     Written by : smtv Desk | Sat, Jan 09, 2021, 03:37 PM

కేంద్రం నుంచి పీఎం కిసాన్ స్కీమ్...రైతుల అకౌంట్లలోకి రూ.6 వేలు!

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌ను తీసుకువచ్చింది. మోదీ సర్కార్ దీని ద్వారా అన్నదాతలకు సంవత్సరానికి రూ.6 వేలు అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుంది. 5 ఎకరాల లోపు పొలం ఉన్న వారు ఈ పథకంలో చేరొచ్చు.
మోదీ అందించే రూ.6 వేలు ఒకేసారి కాకుండా సంవత్సరానికి మూడు విడతల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమవుతుంది. ఇప్పటి వరకు 7 విడతల డబ్బు రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి చేరింది. అయితే పశ్చిమ బెంగాల్‌లో మాత్రం రైతులకు ఈ డబ్బులు రావడం లేదు.
ఎందుకంటే పశ్చిమ బెంగాల్‌లో మోదీ అందిస్తున్న పీఎం కిసాన్ యోజన స్కీమ్ అమలులో లేదు. అందుకే ఇప్పటి వరకు రైతులకు కిసాన్ డబ్బులు రాలేదు. అయితే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకు కూడా పీఎం కిసాన్ రూ.2 వేల డబ్బులు రానున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ స్కీమ్ అమలుకు అంగీకారం తెలిపారు.
అయితే ఇక్కడ ఒక షరతు విధించారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బును రైతులకు అందిస్తుంది. మమతా బెనర్జీ పీఎం కిసాన్ స్కీమ్ అమలుకు అంగీకారం తెలపడం వల్ల ఇకపై రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కిసాన్ డబ్బులు రానున్నాయి.





Untitled Document
Advertisements