మహారాష్ట్రలో ఘోర దుర్ఘటన...ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం పది మంది నవజాత శిశువులు మృతి

     Written by : smtv Desk | Sat, Jan 09, 2021, 03:51 PM

మహారాష్ట్రలో ఘోర దుర్ఘటన...ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం పది మంది నవజాత శిశువులు మృతి

మహారాష్ట్రలోని ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించి, పది మంది నవజాత శిశువులు (అప్పుడే పుట్టిన పిల్లలు) మృతిచెందారు. భండారా జిల్లా సర్వసాధారణ ఆస్పత్రిలోని ఎస్ఎన్ఐసీయూలో శుక్రవారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన సంభవించింది. ప్రమాద సమయానికి ఎన్ఐసీయూలో 17 మంది నవజాత శిశువులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్టు భండారా ఆస్పత్రి సివిల్ సర్జన్ ప్రమోద్ ఖాందాతే వెల్లడించారు. పది మంది నవజాత శిశువులు మృతిచెందగా.. మరో ఏడుగుర్ని రక్షించినట్టు తెలిపారు.

ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. తొలుత ఎన్ఐసీయూ గదిలో నుంచి పొగ వస్తున్న విషయాన్ని గమనించిన నర్సు.. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందడంతో వారు తక్షణమే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపు మంటలకు పది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

విద్యుదాఘాతంతో ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. తొలుత మంటలు అదుపులోకి వచ్చినా పొగ వ్యాపించడంతో చిన్నారులు ఊపిరాడక చనిపోయారు. ప్రమాద సమయానికి ఎన్ఐ‌సీయూతోపాటు ఆస్పత్రిలోని ఇతరవార్డులో పలువురు చిన్నారులు చికిత్స పొందుతున్నారు.





Untitled Document
Advertisements