బ్యాంక్ అదిరే ఆఫర్...సున్నా వడ్డీకే రుణాలు

     Written by : smtv Desk | Sat, Jan 09, 2021, 05:31 PM

బ్యాంక్ అదిరే ఆఫర్...సున్నా వడ్డీకే రుణాలు

బ్యాంకులు కస్టమర్ల నుంచి డిపాజిట్లు సేకరిస్తాయి. ఇలా ఖాతాదారుల నుంచి పొందిన డబ్బులను రుణాల రూపంలో మళ్లీ కస్టమర్లకే అందిస్తాయి. ఇచ్చే రుణాలపై అధిక వడ్డీ రేటును వసూలు చేస్తాయి. కస్టమర్ల నుంచి తీసుకున్న డిపాజిట్లకు తక్కువ వడ్డీ ఇస్తాయి. ఇలా బ్యాంకులు వాటి వ్యాపారాన్ని విస్తరిస్తూ వస్తాయి.

అయితే ఇక్కడ ఒక బ్యాంక్ మాత్రం సున్నా వడ్డీకే రుణాలు అందిస్తోంది. ఎలాంటి వడ్డీ లేకుండా హోమ్ లోన్స్ ఆఫర్ చేస్తోంది. అది ఏకంగా ఏకంగా 20 ఏళ్ల కాల పరిమితితో. అంటే మీరు హోమ్ లోన్ తీసుకుంటే 20 ఏళ్ల పాటు ఎలాంటి వడ్డీ కట్టక్కర్లేదు.

అయితే ఇది మన దేశంలో కాదు. డెన్మార్క్‌లోకి అతిపెద్ద బ్యాంక్ డాన్‌స్కీ బ్యాంక్. ఈ బ్యాంక్ సున్నా వడ్డీకే హోమ్ లోన్స్ అందిస్తోంది. రుణ గ్రహీతలు 20 ఏళ్ల పాటు వడ్డీ చెల్లించాల్సిన పని లేదు. మరో రెండు బ్యాంకులు కూడా ఇదే బ్యాంక్ దారిలో నడిచేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

డెన్కార్క్‌లోకి కేంద్ర బ్యాంక్ అక్కడ వడ్డీ రేట్లను - 0.6 శాతంగా నిర్ణయించింది. అంటే మీరు బ్యాంక్‌‌లో డబ్బులు దాచుకుంటే మీరే బ్యాంక్‌కు మళ్లీ వడ్డీ కట్టాలి. 2012లో వడ్డీ రేట్లు సున్నా కిందకు వెళ్లిపోయాయి. బ్యాంక్ 200 చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. తర్వాత అంటే గత ఎనిమిదేళ్లుగా ఇదే ట్రెండ్ నడుస్తూ వస్తోంది.





Untitled Document
Advertisements